నగరంలో విజయ డెయిరీ అమ్మకాలు

ABN , First Publish Date - 2020-03-29T10:59:24+05:30 IST

లాక్‌డౌన్‌ నేపథ్యంలో పాలు, మజ్జిగ కోసం ప్రజలు ఇబ్బంది పడకుండా ఆంధ్రప్రదేశ్‌ పాడి పరిశ్రమాభిృద్ధి సహకార సమా ఖ్య ఆధ్వర్యంలో విజయ డెయిరీ అధికారులు నగరంలో 8 విక్రయ కేంద్రాలు ఏర్పాటుచేశారు.

నగరంలో విజయ డెయిరీ అమ్మకాలు

ప్రాంతాల్లో విక్రయ కేంద్రాల ఏర్పాటు


అనంతపురం అర్బన్‌, మార్చి 28: లాక్‌డౌన్‌ నేపథ్యంలో పాలు, మజ్జిగ కోసం ప్రజలు ఇబ్బంది పడకుండా ఆంధ్రప్రదేశ్‌ పాడి పరిశ్రమాభిృద్ధి సహకార సమా ఖ్య ఆధ్వర్యంలో విజయ డెయిరీ అధికారులు నగరంలో 8 విక్రయ కేంద్రాలు ఏర్పాటుచేశారు. ఉదయం 5 నుంచి 8.30 గంటల వరకు ఇవి అందుబాటులో ఉండనున్నాయి. నిర్దేశిత సమయంలో సమీప విక్రయకేంద్రాల్లో పాలు, మజ్జిగ కొనుగోలు చేసి లాక్‌డౌన్‌కు సహకరించాలని డెయిరీ డీడీ శశాంకధర పేర్కొన్నారు. సమీపంలోని విక్రయ కేంద్రాలను కింది నెంబర్లలో సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చునన్నారు.


జిల్లావ్యాప్తంగా దుకాణదారులకు పాలు, మజ్జిగ సరఫరా చేస్తామన్నారు. గిట్టుబాటుధరకే వాటిని ఇవ్వనున్నామన్నారు. ఆసక్తిగల దు కాణదారులు 8686853595 నెంబర్‌లో సంప్రదించాలని కోరారు. 


ప్రభుత్వ విజయ డెయిరీ పాల ధరలు..

పాల రకాలు పరిమాణం ధర

మి.లీటర్లలో.. రూ.లలో


ఫుల్‌ క్రీమ్‌ పాలు 500 27

టోన్డ్‌ పాలు 500 22

టోన్డ్‌ పాలు 200 10

మజ్జిగ 200       07


నగంలోని విక్రయ కేంద్రాల వివరాలు..

విక్రయ కేంద్రం సెల్‌ నెంబర్‌


విద్యుత్‌నగర్‌ సర్కిల్‌ 6281076416

కోర్టు రోడ్డు 8639069451

శారదానగర్‌ 7989762665

లక్ష్మీనగర్‌(పీటీసీ రోడ్డు) 9704036139

రామ్‌నగర్‌ 80ఫీట్‌ రోడ్‌ 9014029416

శ్రీనివాస నగర్‌ 9666978030

బసవన్నకట్ట 9000467887

కలెక్టర్‌ ఆఫీసు దగ్గర 7981199802

Updated Date - 2020-03-29T10:59:24+05:30 IST