మోదీ సభ విజయవంతం చేయాలి

ABN , First Publish Date - 2022-07-02T06:17:19+05:30 IST

మోదీ సభ విజయవంతం చేయాలి

మోదీ సభ విజయవంతం చేయాలి
క్షత్రియ పరిషత్‌ సమావేశంలో మాట్లాడుతున్న శ్రీరంగనాథరాజు

రాజకీయాలకు అతీతంగా తరలిరండి
సభికులకు ఆహారం, పార్కింగ్‌ సౌకర్యాలు: క్షత్రియ పరిషత్‌
భీమవరం, జూలై 1: అల్లూరి విగ్రహావిష్కరణ సందర్భంగా  పెద అమిరంలో నిర్వహించే ప్రధాని నరేంద్ర మోదీ సభను రాజకీయాలకు అతీతంగా విజయవంతం చేయాలని క్షత్రియ పరిషత్‌ పిలుపునిచ్చింది. అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రంలో రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి హాజరైన క్షత్రియ సంఘాలతో శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించింది. వసతుల కల్పన, జన సమీకరణ, భోజన వసతి, పార్కింగ్‌ సౌకర్యం, ట్రాఫిక్‌ మళ్లింపుపై చర్చించారు. మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు, ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు, క్షత్రియ కార్పొరేషన్‌ చైర్మన్‌ సర్రాజు, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భూపతిరాజు శ్రీనివాసవర్మ, సీతారామరాజు సాంస్కృతిక కేంద్రం అధ్యక్షుడు గాదిరాజు సుబ్బరాజు తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

సీఎం సభకు వస్తున్నారు
కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహిస్తోందని మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు తెలిపారు. ముఖ్యమంత్రీ సభకు విచ్చేస్తున్నారని కొందరు దీనిపై అపోహలు వీడాలన్నారు. ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల నుంచి వచ్చే వాహనాలకు తాడేపల్లిగూడెం రోడ్డు, పాలకొల్లు రోడ్డు నుంచి, కృష్ణా నుంచి దక్షిణ కోస్తా జిల్లాల నుంచి వచ్చేవారు 216 జాతీయ రహదారి లోసరి నుంచి, కలిదిండి మీదుగా, కైకలూరు రోడ్డు, గణపవరం రోడ్డులో రావాలని ఆయా ప్రాంతాల్లో వారికి వసతి సౌకర్యాలు ఉంటాయని చెరుకువాడ తెలిపారు.



కులమతాలకతీతంగా రండి
పాలకోడేరు: ప్రధాని సభను కులమతాలకు అతీ తంగా హాజరై విజయవంతం చేయాలని ఉండి ఎమ్మె ల్యే మంతెన రామరాజు పిలుపునిచ్చారు. మోగల్లులో అల్లూరి విగ్రహం వద్ద ఆయన సమావేశం నిర్వహించారు. అల్లూరి విగ్రహానికి నివాళులర్పించారు. గ్రామాభివృద్ధిపై ఎంపీ రఘురామకృష్ణంరాజుతోపాటు మీరూ ప్రధానితో మాట్లాడాలని ఎమ్మెల్యేకు సర్పంచ్‌ భర్త మల్లిపూడి శ్రీను, మోగల్లు సంకురుడు, దెందుకూరు కోటిరాజు, సుబ్రహ్మణ్యంరాజు వినతిపత్రం అందించారు. దెందుకూరి ఠాగూర్‌ కోటేశ్వరరాజు, సూర్యనారాయణరాజు పాల్గొన్నారు.  


Updated Date - 2022-07-02T06:17:19+05:30 IST