శివారు.. ఎడారే!

ABN , First Publish Date - 2022-06-24T05:24:12+05:30 IST

వంశధార కాలువకు సంతబొమ్మాళి మండలం శివారున ఉంది. ప్రతిఏటా ఖరీఫ్‌లో రైతులు ఈ కాలువ కింద వరి సాగు చేస్తారు. అయితే కాలువల్లో పూడిక పెరిగి ఆయకట్టుకు సరిగా నీరందడం లేదు. దీనిపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. గత ఖరీప్‌లో బోరుభద్ర రైతులందరూ చందాలు వేసుకుని ఐదు కిలోమీటర్ల మేర కాలువలో పూడిక తీయించారు. ఇటీవల సంతబొమ్మాళి మండల స

శివారు.. ఎడారే!
- పూడికలతో నిండుపోయిన మలగాం వద్ద 26 ఎల్‌ కాలువ


పూడిక పెరిగి అందని వంశధార నీరు

తీవ్రంగా నష్టపోతున్న ఆయకట్టు రైతులు

(సంతబొమ్మాళి)

 వంశధార కాలువకు సంతబొమ్మాళి మండలం శివారున ఉంది. ప్రతిఏటా ఖరీఫ్‌లో రైతులు ఈ కాలువ కింద వరి సాగు చేస్తారు. అయితే కాలువల్లో పూడిక పెరిగి ఆయకట్టుకు సరిగా నీరందడం లేదు. దీనిపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. గత ఖరీప్‌లో బోరుభద్ర రైతులందరూ చందాలు వేసుకుని ఐదు కిలోమీటర్ల మేర కాలువలో పూడిక తీయించారు. ఇటీవల సంతబొమ్మాళి మండల సర్వసభ్య సమావేశంలో కూడా సభ్యులు శివారు భూములుకు సాగునీరు అందడంలేదని ప్రస్తావించారు. అధికారులు కాలువల వైపు కన్నెత్తి చూడడం లేదని వంశధార అధికారులను నిలదీశారు. 

- 25ఆర్‌ మేఘవరం కాలువ పరిధిలో బోరుభద్ర, పాలతలగాం, శ్రీకృషాపురం, గొదలాం, సీపురం, మలగాం పరిధిలో ఐదు వేల ఎకరాలు నీరందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

- 26ఎల్‌ ఉదయపురం కాలువలో పూడిక పెరిగిపోయి మూడేళ్లుగా నీరు రావడంలేదు. ఈ కాలువ పూర్తిగా మూతపడే స్థితికి చేరుకుంది.

- 29ఎల్‌ కొల్లిపాడు రామసాగరం నుంచి మూలపేట వరకు ఆరు కిలోమీటర్ల మేర 10 వేల ఎకరాలకు నీరు అందడం లేదు, కాలువల్లో పూడిక పేరుకుపోయింది. 

- 18ఆర్‌ ఉమిలాడ పరిధిలోని ఉమిలాడ, ఎస్‌బీ కొత్తూరు, జగన్నాథపురం వరకు రెండు వేల ఎకరాలకు సకాలంలో నీరు రావడంలేదు. 

- 7ఆర్‌ వడ్డితాండ్ర కాలువ, 11ఎల్‌ కోటపాడు కాలువ ద్వారా కొత్తూరు, కోటపాడు, కాశీపురం గ్రామాల్లో 3వేల ఎకరాలకు నీరు అందడం లేదు. ఈ ఆయకట్టు రైతులు సొంత డబ్బులతో దండుగోపాలపురం వద్ద సైఫన్‌ను మరమ్మతులు చేసుకున్నారు.

- 48ఆర్‌ నౌపడ, 15ఎల్‌ నౌపడ కాలువ పరిధిలో నౌపడ, కుర్మానాథపురం, యామలపేట, హెచ్‌.ఎన్‌ పేట, ఆకాశలక్కువరం గ్రామాలకు వంశధార నీరు వచ్చే పరిస్థితి లేదు.

- 60ఆర్‌ పరిధిలో మర్రిపాడు, భావనపాడు గ్రామాల పరిధిలో వెయ్యి ఎకరాలకు నీరు అందడం లేదు.

మూడేళ్లుగా నీరు రావడం లేదు: 

మూడేళ్లుగా వంశధార కాలువకు నీరురాక చాలా ఇబ్బందులు పడుతున్నాం. వేలాది రుపాయిలు ఖర్చు చేసి వరి సాగు చేస్తున్నా నీరు పంట దెబ్బ తింటోంది. వర్షంపైనే ఆధారపడుతున్నాం. ఈ ఏడాదైనా సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలి.

- రుప్ప రాజారావు, రైతు, మలగాం


అధికారులు రావడంలేదు:

మూడేళ్లుగా వంశధార కాలువల ద్వారా నీరు రాకపోయినా అధికారులు ఇటువైపు రావడం లేదు. గత ఏడాది ఖరీ్‌లోఓ మా గ్రామ రైతులు సొంత డబ్బులతో ఐదు కిలోమీటర్లు మేర పూడిక తొలగించుకున్నాం. 

- గున్న కృష్ణారావు, రైతు, బోరుభద్ర 


మరమ్మతులు చేపడుతున్నాం:

మేఘవరం కాలువ పరిధిలో పాలతలగాం వరకు మరమ్మతులు చేస్తున్నాం. శివారు కాలువల్లో మరమ్మతులకు నిధుల కొరత ఉంది. ఇప్పుడు చేపడుతున్న పనులతో కూడా శివారు భూములకు సాగునీరు అందుతుంది.

బాబ్జి వంశధార డీఈ, నరసన్నపేట సెక్షన్‌


కాలువల్లో పనులు జరుగుతున్నాయి:

ప్రధాన కాలువల్లో పనులు చురుగ్గా సాగుతున్నాయి. దీనివల్ల ప్రవాహం పెరిగి శివారుకు నీరు అందుతుంది. సంతబొమ్మాళి మండలంలోని దండుగోపాలపురం కాలువ పనులు చేపడుతున్నాం.

- అప్పలనాయుడు, వంశధార డీఈ, టెక్కలి సెక్షన్‌ 




Updated Date - 2022-06-24T05:24:12+05:30 IST