సబ్సిడీ విత్తనాలను వినియోగించుకోవాలి

ABN , First Publish Date - 2021-10-26T05:54:39+05:30 IST

రైతులు సబ్సిడీ విత్తనాలను వినియోగించుకోవాలని ఎంపీపీ పోరెడ్డి అరుణా చెంచిరెడ్డి అన్నారు.

సబ్సిడీ విత్తనాలను వినియోగించుకోవాలి
విత్తనాలను పంపిణీ చేస్తున్న ఎంపీపీ అరుణా చెంచిరెడ్డి


మార్కాపురం, అక్టోబరు 25:  రైతులు   సబ్సిడీ విత్తనాలను వినియోగించుకోవాలని ఎంపీపీ పోరెడ్డి అరుణా చెంచిరెడ్డి అన్నారు. మండలంలోని భూపతిపల్లిలో సోమవారం సబ్సిడీపై రైతులకు మంజూరు చేసిన శనగ విత్తనాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ బొగ్గరపు శేషయ్య, మండల కోఆప్షన్‌ సభ్యుడు షేక్‌ మ హమ్మద్‌ రఫీ, ఎంపీటీసీ మల్లాపురం లక్ష్మీదేవి, సర్పంచ్‌ మున్నంగి కోటేశ్వరి, ఏవో లక్ష్మీనా రాయణ, రైతులు పాల్గొన్నారు. 

తర్లుపాడులో..

తర్లుపాడు : మండలంలోని సన్న చిన్నకారు రైతులకు 25 శాతంతో మంజూరైన శనగ విత్త నాలను ఎంపీపీ సూరెడ్డి భూలక్ష్మి సోమవారం పంపిణీ చేశారు. మండలంలో 633 క్విం టాళ్లను 729 మంది రైతులకు అందజేశారు. జేజి-11 రకం శనగ విత్తనాలు క్వింటా రూ.6900 కాగా సబ్సిడీ రూ.1725 పోగా రూ.5175 రైతుల వద్ద తీసుకొని పంపిణీ చేసి నట్లు వ్యవసాయాధికారి చంద్రశేఖర్‌ తెలిపారు. సీతానాగులవరం గ్రామంలో 486 మంది రైతులకు 417 క్వింటాళ్లు, తర్లుపాడులో 240 మంది రైతులకు 210, మీర్జపేటలో ముగ్గురు రైతులకు మూడు క్వింటాళ్లను పంపిణీ చేసి నట్లు  ఏవో తెలిపారు. ఈ సందర్భంగా మా ర్కాపురం వ్యవసాయ సహా య సంచాలకులు రమా దేవి మాట్లాడుతూ రైతులు తప్పనిసరిగా  విత్తే ముం దు విత్తన శుద్ధి తప్పని సరిగా చేసుకోవాలని సూ చించారు.  దానివలన ఎం డు తెగులు, ఏరు కుళ్లు తె గులు రాకుండా పంటను కాపాడుతుందన్నారు. ఈ నెల 25 నుంచి వచ్చే నెల 15 లోపు శనగ విత్తనాలను వేసుకోవాలని ఆమె సూచిం చారు. కార్యక్రమంలో సీతా నాగులవరం గ్రామ స ర్పంచ్‌ టి.ఆంజనేయులు, వె న్నా సత్యనారాయణరెడ్డి, సూరెడ్డి రామసుబ్బారెడ్డి, ప లువురు ఎంపీవోలు, రైతు లు పాల్గొన్నారు.

అర్ధవీడులో..

కంభం (అర్థవీడు) : రైతుల సంక్షేమమే ధ్యేయ మని అర్ధవీడు ఎంపీపీ, జడ్పీటీసీ నూడురి వెంకటరావు, చెన్ను విజయమ్మ తెలిపారు. నాగులవరంలో రైతు భరోసా కేంద్రం వద్ద శనగ విత్తనాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాగులవరం సర్పంచ్‌ దండుగ సావిత్రి, వెంకటేశ్వరరెడ్డి, గోపాల్‌రెడ్డి, రైతులు పాల్గొన్నారు.

రాచర్లలో..

రాచర్ల : ప్రభుత్వం రాయితీపై శనగల పంపిణీ కార్యక్రమం చేపట్టిందని, రైతులు వాటిని వినియోగించుకోవాలని జడ్పీటీసీ సభ్యు డు పగడాల శ్రీరంగం అన్నారు. సోమవారం రాచర్ల రైతు భరోసా కేంద్రంలో ఆయన రైతులకు 25శాతం రాయితీపై సబ్సిడీ విత్తనాలను రైతులకు అందచేశారు. 

వ్యవసాయాధికారి షేక్‌ హహబూబ్‌బాషా మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాలలో 980 క్వింటాళ్ల శనగ విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, నమోదు చే సుకున్న రైతులు క్వింటాకు రూ.5172  చెల్లించి తీసుకెళ్లాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో మస్తాన్‌వలి, ఈవో ఆర్డీ, వీఏఏలు పాల్గొన్నారు.


Updated Date - 2021-10-26T05:54:39+05:30 IST