Abn logo
Sep 25 2021 @ 00:58AM

పంటల నమోదుతోనే రాయితీలు వర్తింపు

రైతులతో మాట్లాడుతున్న వ్యవసాయ కమిషనర్‌

రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్‌ అరుణ్‌కుమార్‌


కశింకోట, సెప్టెంబరు 24: పంటల నమోదుతోనే వ్యవసాయ రంగ రాయితీలు వర్తిస్తాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్‌ తెలిపారు. నూతనగుంటపాలెం రైతుభరోసా కేంద్రాన్ని సందర్శించి రైతులతో ఆయన మాట్లాడారు. రైతులు సంఘాలుగా ఏర్పడితే రాయితీపై ఆధునాతన వ్యవసాయ పనిముట్లు పొందవచ్చని చెప్పారు. ఆర్‌బీకేల్లో ఎరువులు అందుబాటులో ఉంచనున్నట్టు చెప్పారు. అనంతరం ఈ పంట నమోదు పత్రాలను రైతులకు అందించారు. ఆర్‌బీకే కేంద్రం నుంచి అందుతున్న సేవలపై ఆరా తీశారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జాయింట్‌ డైరెక్టరు లీలావతి, డీడీ మోహన్‌రావు, ఏవో కె.విజయ్‌కుమార్‌, ఏఈవో నూకశ్రీను, సర్పంచ్‌ కలగెట్ల నూకరత్నం, ఏనుగుతుని ఉప సర్పంచ్‌ రామగణేశ్‌ పాల్గొన్నారు.