సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు అవినీతి నిలయాలు

ABN , First Publish Date - 2021-06-18T03:50:07+05:30 IST

జిల్లాలోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు అవినీతి నిలయాలుగా మారాయి. ప్రతీ పనికి ఓ రేటు చొప్పున అధికారులు వసూళ్లకు పాల్పడుతున్నారు. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాల యాల్లో ముడుపులు చెల్లించనిదే అసలు పనులు కావడం లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు లాభం చేకూర్చే విధం గా నిబంధనలను ఉల్లంఘించి రిజిస్ట్రేషన్లు చేస్తు న్నారు. రియల్టర్లతో కుమ్మక్కవుతున్న అధికారులు అందినకాడికి దండుకుంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా భూములకు రిజిస్ట్రేషన్లు చేసిన ఇద్దరు సబ్‌ రిజిస్ట్రార్లపై ఇటీవల ఉన్నతాధికా రులు సస్పెన్షన్‌ వేటు వేయడం రిజిస్ట్రేషన్ల శాఖలో అవినీతికి నిదర్శనం.

సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు అవినీతి నిలయాలు
మంచిర్యాల సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం

రియల్టర్లతో కుమ్ముక్కవుతున్న అధికారులు

నిబంధనలకు విరుద్ధంగా భూముల రిజిస్ట్రేషన్‌

ప్రతీ పనికీ ఓ రేటు చొప్పున వసూళ్లు

జిల్లాలో ఇద్దరు అధికారులపై సస్పెన్షన్‌ వేటు

మంచిర్యాల, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు అవినీతి నిలయాలుగా మారాయి. ప్రతీ పనికి ఓ రేటు చొప్పున అధికారులు వసూళ్లకు పాల్పడుతున్నారు. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాల యాల్లో ముడుపులు చెల్లించనిదే అసలు పనులు కావడం లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.  రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు లాభం చేకూర్చే విధం గా నిబంధనలను ఉల్లంఘించి రిజిస్ట్రేషన్లు చేస్తు న్నారు. రియల్టర్లతో కుమ్మక్కవుతున్న అధికారులు అందినకాడికి దండుకుంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా భూములకు రిజిస్ట్రేషన్లు చేసిన ఇద్దరు సబ్‌ రిజిస్ట్రార్లపై ఇటీవల ఉన్నతాధికా రులు సస్పెన్షన్‌ వేటు వేయడం రిజిస్ట్రేషన్ల శాఖలో అవినీతికి నిదర్శనం. నిబంధనల పేరుతో సామాన్య ప్రజలను ముప్పుతిప్పలు పెడుతూ కార్యాలయాల చుట్టు రోజుల తరబడి తిప్పుకొనే అధికారులు డబ్బు లు ఇస్తామంటే అర్థరాత్రులు కూడా పనులు చేసిపెడుతున్నారు.

పేరుకే సిటీజన్‌ చార్టర్‌...

జిల్లాలో మంచిర్యాల, లక్షెట్టిపేటలో రెండు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఉన్నాయి. ఆయా  కార్యాల యాల గోడలకు సిటిజన్‌ చార్టర్‌ కూడిన బోర్డులు అతికించారు. కానీ అందులో పేర్కొన్న విధంగా సమయపాలన పాటించకపోవడంతో అవి అలంకార ప్రాయంగా మారాయి. సిటిజన్‌ చార్టులో ఒక్కో పనికి ఎంత సమయం పడుతుందనేది స్పష్టంగా పేర్కొ న్నారు. భూముల దస్తావేజుల రిజిస్ట్రేషన్లు చేసేం దుకు గరిష్టంగా 24 గంటల సమయం పడుతుండగా, కంప్యూటరైజ్డ్‌ ఎన్‌కంబరెన్స్‌ సర్టిఫికెట్‌ (ఈసీ) జారీ చేసేందుకు గంట, అలాగే ఈసీ నకలు మ్యానువల్‌గా ఇచ్చేందుకు 24 గంటలు, పెళ్లిళ్ల రిజిస్ట్రేషన్‌కు గంట, పెండింగ్‌ డాక్యుమెంట్లు ఇచ్చేందుకు ఒకరోజు, పెం డింగ్‌ డాక్యుమెంట్లు సెక్షన్‌ 47-ఏ కింద జారీ చేసేం దుకు 7 రోజులు, భూముల మార్కెట్‌ వ్యాల్యూ సర్టిఫి కెట్లు ఇచ్చేందుకు గంట సమయం కేటాయిస్తూ సిటి జన్‌ చార్టులో పేర్కొన్నారు. అయితే ఈ నిబంధనలన్నీ ప్రభుత్వం నిర్ణయించిన అసలు ఛార్జీలు పోను అద నంగా ఇచ్చే వారికి మాత్రమే వర్తిస్తాయి. లేకుంటే రోజుల తరబడి కార్యాలయం చుట్టూ తిరగాల్సిందే. 

ప్రతి పనికీ ఓ రేటు...

సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ప్రతి పనికీ ఓ రేటును ఫిక్స్‌ చేసుకొని మరీ వసూళ్లకు పాల్పడు తున్నారు. భూములు, ఇతర ఆస్తులకు సంబంధించిన దస్తావేజుల రిజిస్ట్రేషన్లకు మార్కెట్‌ వ్యాల్యూ పైన సేల్‌ డీడ్‌ అయితే స్టాంపు డ్యూటీ 4 శాతం, ట్రాన్స్‌ ఫర్‌ డ్యూటీ సుంకం 1.5 శాతం, రిజిస్ట్రేషన్‌ చార్జీలు 0.5 చొప్పున మొత్తం 6 శాతం చార్జీలు చెల్లించాలి. అదే గిఫ్ట్‌ డీడ్‌ అయితే స్టాంపు డ్యూటీ 1 శాతం, ట్రాన్స్‌ఫర్‌ డ్యూటీ 0.5 శాతం, రిజిస్ట్రేషన్‌ ఫీజు 0.5 చొప్పున కనీసం రూ.1000, గరిష్టంగా రూ. 10 వేలు చెల్లించాలి. పై చార్జీలు ఆన్‌లైన్‌లో చెల్లించాల్సి ఉం డగా ఒక్కో డాక్యమెంటుపై రూ.1000 వరకు అద నంగా వసూలు చేస్తున్నట్లు సమాచారం. నిబంధనల మేరకు లొసుగులు ఉన్న పక్షంలో కనీసం రూ. 3 వేల నుంచి రూ.15 వేల వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈసీ జారీ చేసేందుకు 1983 నుంచి ఇప్పటి వరకు చార్జీలు రూ. 220, అంతకు ముందు సంవత్సరాలకు సంబంధించి ఈసీ జారీ చేసేందుకు రూ. 520 చార్జీలు చెల్లించాలి. అయితే వాటికి అదనంగా మరో రూ.200 వసూలు చేస్తు న్నారు. అలాగే ధ్రువీకరించిన నకలు కాపీలు జారీ చేసేందుకు ప్రభుత్వపరంగా ఛార్జీలు 1983 నుంచి ఇప్పటివరకు రూ.220, అంతకు ముందు కావాలంటే రూ.520 చెల్లించాలి. ఇక్కడ అదనంగా రూ.300  వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. స్థిరాస్థి విలువ నిర్ధారణ పత్రం (మార్కెట్‌ వ్యాల్యూ సర్టిఫికెట్‌) జారీకి అధికారికంగా రూ.10 చెల్లించాల్సి ఉండగా,  రూ. 200 అదనంగా వసూలు చేస్తున్నారు. పెళ్లి రిజి స్ట్రేషన్లకు రూ.250 ఛార్జీ ఉండగా, రూ.500 వసూలు చేస్తున్నారు.  

ఇద్దరు అధికారులపై వేటు...

జిల్లాలోని రెండు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో నిబంధనలకు విరుద్ధంగా భూముల రిజిస్ట్రేషన్‌లు చేసిన ఇద్దరు అధికారులపై ఉన్నతాధికారులు సస్పె న్షన్‌ వేటు వేశారు. మంచిర్యాల సబ్‌రిజిస్ట్రార్‌ కార్యా లయం పరిధిలోని క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ తిమ్మా పూర్‌ శివారు సర్వే నెంబర్‌ 355లో ఉన్న 847 చద రపు గజాల స్థలాన్ని సబ్‌ రిజిస్ట్రార్‌ అప్పారావు ముగ్గురి పేరిట రిజిస్ట్రేషన్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన నిబంధనల ప్రకారం ఒక డాక్యుమెంటును అలాగే మరొకరి పేరిట రిజిస్ట్రేషన్‌ చేయాలి గానీ విభజించి చేయకూడదు. అయితే ఇక్కడ నిబంధన లకు విరుద్ధంగా ముగ్గురి పేరిట విభజించి రిజిస్ట్రేషన్‌ చేయడంతో ఫిర్యాదులు అందుకున్న స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్స్‌ డిపార్ట్‌మెంటు కరీంనగర్‌ డిప్యూటీ ఇన్‌ స్పెక్టర్‌ జనరల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ను సస్పెండ్‌ చేస్తూ ఈ నెల 15న ఉత్తర్వులు జారీ చేశారు. 

లక్షెట్టిపేట కార్యాలయంలో ఇన్‌చార్జి సబ్‌ రిజిస్ట్రార్‌ రతన్‌ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ రిజిస్ట్రేషన్లు చేశారు. రియల్టర్లకు లబ్ధి చేకూర్చే విధంగా మున్సిప ల్‌, లే అవుట్‌ నిబంధనలకు విరుద్ధంగా మే 11న అర్థరాత్రి 39 అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడ్డారు. రియ ల్టర్లు ఇచ్చే ముడుపులకు ఆశపడ్డ సబ్‌ రిజిస్ట్రార్‌ అక్ర మంగా రిజిస్ట్రేషన్లు చేస్తుండగా కాంగ్రెస్‌, బీజేపీ నేతలు అడ్డుకోవడంతో విషయం వెలుగు చూసింది. దీంతో విచారణ జరిపిన రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు ఇన్‌చార్జి సబ్‌ రిజిస్ట్రార్‌ను సస్పెండ్‌ చేశారు. జిల్లాలోని రెండు కార్యాలయాల్లో అధికారులు అవినీతికి పాల్పడి సస్పెండ్‌ కావడం రిజిస్ట్రేషన్ల శాఖలో కలకలం రేపుతోంది.  


Updated Date - 2021-06-18T03:50:07+05:30 IST