తీరప్రాంత పరిశుభ్రతతో జలసంపదకు మనుగడ

ABN , First Publish Date - 2021-09-19T04:29:29+05:30 IST

తీరప్రాంత పరిశుభ్రతతో జలసంపద మనుగడ సాధ్యమని కృష్ణపట్నం కోస్టుగార్డు కార్యాలయ కమాండర్‌ అభిక్‌ చక్రబర్తి అన్నారు.

తీరప్రాంత పరిశుభ్రతతో జలసంపదకు మనుగడ
కమాండర్‌తో కలసి చెత్తను తొలగిస్త్తున్న కోస్టుగార్డులు

కోస్టల్‌ క్లీనప్‌లో  కమాండర్‌ అభిక్‌ చక్రబర్తి

ముత్తుకూరు, సెప్టెంబరు18: తీరప్రాంత పరిశుభ్రతతో జలసంపద మనుగడ సాధ్యమని కృష్ణపట్నం కోస్టుగార్డు కార్యాలయ కమాండర్‌ అభిక్‌ చక్రబర్తి అన్నారు.  మండలంలోని కృష్ణపట్నం తీరంలో శనివారం ఇండియన్‌ కోస్టు గార్డు ఆధ్వర్యంలో కోస్టల్‌ క్లీనప్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏటా సెప్టెంబరు మూడో శనివారం అంతర్జాతీయ కోస్టల్‌ క్లీనప్‌ దినోత్సవంగా నిర్వహిస్తున్నామన్నారు. తీరప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచడం అందరి బాధ్యతగా పేర్కొన్నారు.  తీర పరిశుభ్రత పట్ల స్థానికుల్లో అవగాహన పెంపొందించే ప్రయత్న చేస్తున్నామన్నారు. తీర ప్రాంతంలో వ్యర్ధపదార్థాలను పడవేయడం వల్ల సముద్రం కాలుష్యానికి గురవుతుందన్నారు.  పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చెందిన తీరప్రాంతాల్లో సందర్శకులు చెత్తాచెదారం, ప్లాస్టిక్‌ వస్తువులను వేయకూడదన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. కృష్ణపట్నం కోస్టుగార్డు కార్యాలయానికి చెందిన 60 మంది కోస్టుగార్డులు  తీరంలో ఉన్న వ్యర్థాలను సేకరించి తరలించారు. ఈ సందర్భంగా తీరప్రాంత భద్రత, పరిరక్షణపై తీర గ్రామాల ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కమాండెంట్‌లు దిలీప్‌ చక్రవర్తి, అంబరీష్‌, డిప్యూటీ కమాండెంట్‌ విజయకుమార్‌, అసిస్టెంట్‌ కమాండెంట్‌ గిరీష్‌ కుమార్‌,  కోస్టుగార్డు సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-09-19T04:29:29+05:30 IST