సుబ్రహ్మణ్యస్వామి ఆలయ రాజగోపురం నిర్మాణానికి స్థల పరిశీలన

ABN , First Publish Date - 2020-08-03T10:35:52+05:30 IST

కార్వేటినగరం స్కంధపుష్కరిణి సమీపంలో కుమారగిరిపై వెలసిన వళ్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి ఆలయ రాజగోపురం నిర్మాణానికి ..

సుబ్రహ్మణ్యస్వామి ఆలయ  రాజగోపురం నిర్మాణానికి స్థల పరిశీలన

నేడు డిప్యూటీ సీఎం భూమిపూజ


కార్వేటినగరం, ఆగస్టు 2: కార్వేటినగరం స్కంధపుష్కరిణి సమీపంలో కుమారగిరిపై వెలసిన వళ్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి ఆలయ రాజగోపురం నిర్మాణానికి సంబంధించిన స్థలాన్ని ఎండోమెంట్‌ డిప్యూటీ కమిషనర్‌ డి.సుబ్బారావు ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఆలయ రాజగోపురం నిర్మాణానికి నిధులు మంజూరు చేసిందన్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు డిప్యూటీ సీఎం నారాయణస్వామి రాజగోపురం నిర్మాణానికి  భూమిపూజ చేయనున్నట్లు చెప్పారు. ఎండోమెంట్‌ ఈవో రవీంద్రరాజు, మండల వైసీపీ యువత కన్వీనర్‌ ధనశేఖర్‌యాదవ్‌ పాల్గొన్నారు. ఆదివారం ఉదయం ఆలయ పరిసరాలను మండల వైసీపీ కన్వీనర్‌ ధనంజయవర్మ, జిల్లా ప్రధాన కార్యదర్శి బాలాజీనాయుడు, పయణిరెడ్డి పరిశీలించారు. 

Updated Date - 2020-08-03T10:35:52+05:30 IST