వైభవంగా సుబ్రమణ్యస్వామి ఆలయ ఆణి వరుషాభిషేకం

ABN , First Publish Date - 2022-07-09T15:19:19+05:30 IST

తిరుచెందూర్‌ సుబ్రమణ్యస్వామి ఆలయ ఆణి వరుషాభిషేకం వేడుకలు శుక్రవారం కన్నువపండువగా సాగాయి. వేడుకల సందర్భంగా తెల్లవారుజామున 4

వైభవంగా సుబ్రమణ్యస్వామి ఆలయ ఆణి వరుషాభిషేకం

                               - పోటెత్తిన భక్తులు


ప్యారీస్‌(చెన్నై), జూలై 8: తిరుచెందూర్‌ సుబ్రమణ్యస్వామి ఆలయ ఆణి వరుషాభిషేకం వేడుకలు శుక్రవారం కన్నువపండువగా సాగాయి. వేడుకల సందర్భంగా తెల్లవారుజామున 4 గంటలకు ఆలయాన్ని తెరచి, 4.30 గంటలకు విశ్వరూప దీపారాధన, 5 గంటలకు ఉదయమార్తాండ అభిషేకం, దీపారాధన నిర్వహించారు. అనంతరం ఆలయ మహా మండపం నుంచి ఉత్సవమూర్తి, వల్లి, దేవసేన అమ్మవారి కలశాలు, కుమారవిడంగ పెరుమాళ్‌ సన్నిధిలోని షణ్ముగర్‌ కలశం, పెరుమాళ్‌ సన్నిధిలోని కలశాలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, ఆలయ రాజగోపురం వద్దకు చేర్చారు. ఉదయం 8.55 గంటల సమయంలో విమానాలకు వరుషాభిషేకం నిర్వహించారు. అనంతరం షణ్ముగర్‌, పెరుమాళ్‌, వల్లి, దేవయాని అమ్మవారి విమానాలకు కూడా వరుషాభిషేకం చేశారు. ఈ వేడుకల్లో వేలాది మంది భక్తులు పాల్గొని ఉత్సవమూర్తులను సేవించారు.

Updated Date - 2022-07-09T15:19:19+05:30 IST