వైభవంగా సుబ్రహ్మణ్యస్వామి విగ్రహ ప్రతిష్ఠ

ABN , First Publish Date - 2022-05-27T05:53:07+05:30 IST

కొరిశపాడు మండలంలో ని కృష్ణంరాజువారిపాలెం (రెడ్డిపాలెం)లో శ్రీ సు బ్రాహ్మణ్య స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్ర మం శివస్వామి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిం చారు.

వైభవంగా సుబ్రహ్మణ్యస్వామి విగ్రహ ప్రతిష్ఠ
రెడ్డిపాలెంలో ప్రతిష్ఠించిన సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం

మేదరమెట్ల, మే 26: కొరిశపాడు మండలంలో ని కృష్ణంరాజువారిపాలెం (రెడ్డిపాలెం)లో శ్రీ సు బ్రాహ్మణ్య స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్ర మం శివస్వామి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిం చారు. గురువారం ఉదయం 7.45 నిమిషాలకు మహా గణపతి పూజతో ప్రారంభించి 8.39 నిమి షాలకు శ్రీ సుబ్రహ్మణేశ్వరస్వామి ప్రతిష్ఠాపన వే ద మంత్రోచ్ఛరణలు, మంగళ వాయిద్యాల నడు మ ఘనంగా నిర్వహించారు. అనంతరం నాగేశ్వ రస్వామి ఆధ్వర్యంలో రెండు వేల ఆవు పాలతో స్వామివారికి పాలాభిషేకం చేశారు. ప్రత్యేక పూ జా కార్యక్రమం అనంతరం శ్రీవల్లి దేవసేన సమే త సుబ్రహ్మణ్య స్వామి కల్యాణాన్ని ఘనంగా ని ర్వహించారు. సాయంత్రం వెయ్యి కేజీల పూలతో స్వామివారికి పూలాభిషేకం చేశారు. సుమారు 20 వేల మంది భక్తులు ప్రతిష్ఠా కార్యక్రమానికి హా జరయ్యారు. ఆలయ కమిటీ నిర్వహకులు భక్తుల కు అన్నప్రసాదాలతో పాటు అన్ని ఏర్పాట్లు చేశారు. విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో శాప్‌నెట్‌ చైర్మన్‌ బాచిన కృష్ణచైతన్య, మాజీ ఎమ్మెల్యే గరటయ్య హాజరయ్యారు. ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 


భావనారాయణునికి మల్లెపూల సేవ

చినగంజాం, మే 26: స్థానిక భూ సమేత భావనారాయణస్వామి ఆల యంలోని భావనారాయణునికి గురువారం రాత్రి మ ల్లెపూల సేవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

అర్చకులు మెహనలక్ష్మీనరసింహాచార్యుల ఆధ్వ ర్యంలో స్వామి వారిని మల్లెపూలలతో విశేషంగా అ లంకరించి సహస్రనామార్చన కార్యక్రమాన్ని జరిపా రు. పూజలు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. 


వైభవంగా రేణుకమ్మ కొలుపులు

బల్లికురవ, మే 26: బల్లికురవ గ్రామంలో ఉన్న పావులూరి ఇంటి పేరు గల వంశస్థుల రేణుకమ్మ తల్లి కొలుపులు వైభవంగా జరుగుతున్నాయి. గురువారం కొలుపులలో భాగంగా పుట్ట వద్ద జరిగిన ప్రత్యేక పూజాలలో పావులూరి ఇంటి పేరు కలిగినవారు పాల్గొన్నారు. అనంతరం దేవతను గ్రామంలో ఉరేగింపుగా సంబరం చేశారు.  కార్యక్రమంలో మహిళలు పెద్దఎత్తున పాల్గొన్నారు.

Updated Date - 2022-05-27T05:53:07+05:30 IST