Abn logo
Sep 20 2021 @ 19:19PM

submarine: సబ్ మెరైన్ ఒప్పందంపై అమెరికాను నిందించిన ఉత్తరకొరియా

సియోల్: ఆస్ట్రేలియాకు అణు జలాతంర్గాములు సరఫరా చేయాలనే అమెరికా నిర్ణయాన్ని ఉత్తరకొరియా విమర్శించింది. ఈ ఒప్పందంతో ఉత్తర కొరియా భద్రత ప్రభావితమయితే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. ఆసియా, పసిఫిక్‌లో భద్రతా సమస్యలు తలెత్తుతాయని చెప్పింది. ఈ ఒప్పందాన్ని ఉత్తర కొరియా సునిశితంగా పరిశీలిస్తుందని విదేశాంగ శాఖ అధికారులు చెప్పారు. తమ దేశ భద్రతకు ఎటువంటి సమస్యలు తలెత్తినా తప్పకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అమెరికా అధ్యక్షుడైన జో బైడెన్ ఆస్ట్రేలియాకు 8 అణు జలాంతర్గాములను సరఫరా చేస్తామని గతవారంలో చెప్పారు. ఫలితంగా ఫ్రాన్స్‌తో కుదుర్చుకున్న 12 డిజీల్ సబ్ మెరైన్లకు సంబంధించిన 66 బిలియన్ డాలర్ల ఒప్పందాన్ని కంగారు దేశం రద్దు చేసుకుంది. 


ఉత్తర కొరియా విదేశాంగ శాఖకు చెందిన అధికారి మీడియాతో మాట్లాడుతూ..‘‘ మిత్ర దేశాలు కుదుర్చుకున్న ఒప్పందాలను కూడా అమెరికా కాలరాస్తుంది. దీర్ఘకాల పరిస్థితుల దృష్ట్యా తమ దేశ రక్షణ సామర్థ్యాన్ని ఏ మాత్రం తగ్గించకూడదని ఈ సంఘటన స్పష్టం చేస్తోంది ’’అని వివరించారు. అమెరికాను లక్ష్యంగా చేసుకునే అణు బాంబులు, దీర్ఘకాలిక  క్షిపణి పరీక్షలను ఉత్తర కొరియా 2018లోనే  నిలిపివేసింది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌ల మధ్య దౌత్య చర్చలు ముగిసిన అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది.             











ఇవి కూడా చదవండిImage Caption