సబ్‌జైలు ఆకస్మిక తనిఖీ

ABN , First Publish Date - 2022-07-03T04:59:26+05:30 IST

జమ్మలమడుగు పట్టణంలోని సబ్‌జైలును శనివారం జూనియర్‌ సివిల్‌జడ్జి బాబాఫకృద్దీన్‌ తనిఖీ చేశారు.

సబ్‌జైలు ఆకస్మిక తనిఖీ

జమ్మలమడుగు రూరల్‌, జూలై 2: జమ్మలమడుగు పట్టణంలోని సబ్‌జైలును శనివారం జూనియర్‌ సివిల్‌జడ్జి బాబాఫకృద్దీన్‌ తనిఖీ చేశారు. ముందుగా జడ్జి రిమాండ్‌ ఖైదీలతో మాట్లాడారు.  అలా గే న్యాయవిజ్ఞాన సదస్సులో జడ్జి మాట్లాడుతూ రిమా ండ్‌ ఖైదీలు సత్ప్రవర్తన కలిగి ఉండాలన్నారు. అనవసరంగా తగాదాలలో  తలదూర్చకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గృహ హింసచట్టం, మోటారు వెహికల్‌ చట్టం గురించి వివరించారు. అనంతరం సబ్‌జైలులోని రిమాండ్‌ ఖైదీల రికార్డులను ఆయన తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు భాస్కర్‌రెడ్డి, మునిసుబ్బారెడ్డి, ఆంజనేయులు, జైలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-03T04:59:26+05:30 IST