శ్రావణం వచ్చింది... ముహూర్తాలు తెచ్చింది

ABN , First Publish Date - 2021-08-09T06:08:07+05:30 IST

వివాహాది శుభ ముహుర్తాలు..

శ్రావణం వచ్చింది... ముహూర్తాలు తెచ్చింది

మోగనున్న పెళ్లి బాజాలు 

భారీగా శంకుస్థాపనలు, గృహ ప్రవేశాలు

కళకళలాడనున్న వివిధ రకాల మార్కెట్లు


(అమలాపురం-ఆంధ్రజ్యోతి): వివాహాది శుభ ముహుర్తాలు ప్రారంభం కానున్నాయి. సోమవారం నుంచి శ్రావణ మాసం ప్రారంభం కానుండడంతో పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు, శంకుస్థాపనలు వంటి శుభ కార్యక్రమాల ఘడియలు ఆసన్నమయ్యాయి. ఆషాడ మాసం ఆదివారం ముగిసింది. సోమవారం నుంచి శ్రావణ శోభ సంతరించుకోనుంది. మరోవైపు పెళ్లి బాజాలు మోగనున్నాయి. శ్రావణ శుక్రవారాలు, రాఖీ పౌర్ణమి వంటి పండుగలతో పాటు పెళ్లిళ్లు, ఇతర శుభకార్యక్రమాలకు ముహూర్తాలు అధికంగా ఉండడంతో మార్కెట్లు సైతం కళకళలాడనున్నాయి. కొవిడ్‌ ఆంక్షల నేపథ్యంతో పాటు థర్డ్‌ వేవ్‌ ఆగస్టులో వస్తుందన్న ఆరోగ్య నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో నిబంధనలు పాటిస్తూ పెళ్లిళ్లకు వేల జంటలు సిద్ధమవుతున్నాయి.


శ్రావణమాసం నెల పాటు మంచి ముహూర్తాలు ఉండడం ఆ తర్వాత వచ్చే భాద్రపద మాసంలో శుభ ముహూర్తాలకు ఆస్కారం లేదని ప్రముఖ వాస్తు, జ్యోతిష పండితుడు, బండారులంకకు చెందిన కాలెపు భీమేశ్వరరావు సిద్ధాంతి వెల్లడించారు. భాద్రపద మాసాన్ని శూన్య మాసంగా పేర్కొనడంతో ఆశ్వయుజ మాసంలో మళ్లీ శుభ ముహూర్తాలు ఉన్నాయన్నారు. శ్రావణ మాసంలో పెళ్లిళ్లు భారీగా జరగనుండడంతో వస్త్ర వ్యాపారాలు, బంగారు ఆభరణాల వ్యాపారంతో పాటు కల్యాణ మండపాలు, టెంట్‌ హౌస్‌లు, కిరాణా, డెకరేషన్స వంటి అనేక రకాల వ్యాపారులకు గిరాకీ ఏర్పడనుంది. సోమవారం నుంచి శ్రావణ మాసం ప్రారంభం కావడంతో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఈ నెల 9 నుంచి సెప్టెంబరు 7వ తేదీ వరకు శ్రావణ మాసం కావడంతో వివాహాది శుభ ముహూర్తాల వివరాలు ఇలా ఉన్నాయి.


ఆగస్టు 11వ తేదీ రాత్రి 8.46 గంటలు, రాత్రి 11.13 గంటలు, రాత్రి 3.31 గంటలు, 12వ తేదీ రాత్రి 8.42 గంటలు, రాత్రి 11.09 గంటలు, రాత్రి 3.27 గంటలు, 14వ తేదీ ఉదయం 9.03 గంటలు, ఉదయం 11.55 గంటలు, రాత్రి 11.01 గంటలు, రాత్రి 3.19 గంటలు, 17వ తేదీ రాత్రి 3.06 గంటలు, 19వ తేదీ రాత్రి 2.59 గంటలు, 20వ తేదీ రాత్రి 8.11 గంటలు, రాత్రి 10.38 గంటలు, 21వ తేదీ ఉదయం 8.36 గంటలు, ఉదయం 11.28 గంటలు, 22వ తేదీ ఉదయం 8.32 గంటలు, రాత్రి 10.30 గంటలు, 25వ తేదీ ఉదయం 8.20 గంటలు, ఉదయం 11.12 గంటలు, రాత్రి 10.18 గంటలు, రాత్రి 2.36 గంటలు, ఆగస్టు 26వ తేదీ ఉదయం 8.16 గంటలు, రాత్రి 7.47 గంటలు, రాత్రి 2.32 గంటలు, సెప్టెంబరు 1వ తేదీ ఉదయం 7.53 గంటలు, ఉదయం 10.45 గంటలకు వివాహ శుభ ముహూర్తాలు ఉన్నాయి.


శంకుస్థాపనకు...

ఆగస్టు 11వ తేదీ రాత్రి 3.31 గంటలు, 12వ తేదీ రాత్రి 3.27 గంటలు, 13వ తేదీ ఉదయం 10.21 గంటలు, రాత్రి 3.23 గంటలు, 14వ తేదీ ఉదయం 9.03 గంటలు, రాత్రి 3.19 గంటలు, 16వ తేదీ ఉదయం 11.47 గంటలు, 19వ తేదీ రాత్రి 2.59 గంటలు, 21వ తేదీ ఉదయం 8.36 గంటలు, ఉదయం 11.28 గంటలు, 22వ తేదీ ఉదయం 8.32 గంటలు, 23వ తేదీ ఉదయం 8.28 గంటలు, ఉదయం 11.20 గంటలు, 25వ తేదీ ఉదయం 8.20 గంటలు, ఉదయం 11.12 గంటలు, రాత్రి 2.36 గంటలు, 26వ తేదీ ఉదయం 8.16 గంటలు, రాత్రి 2.32 గంటలు, ఆగస్టు 31వ తేదీ రాత్రి 2.13 గంటలు, సెప్టెంబరు 1వ తేదీ ఉదయం 7.53 గంటలు, ఉదయం 10.45 గంటలు, 2వ తేదీ రాత్రి 2.05 గంటలకు శుభ ముహూర్తాలు కలవు.


గృహ ప్రవేశానికి...

ఆగస్టు 11వ తేదీ రాత్రి 8.46 గంటలు, రాత్రి 11.13 గంటలు, రాత్రి 3.31 గంటలు, 13వ తేదీ రాత్రి 11.05 గంటలు, రాత్రి 3.23 గంటలు, 16వ తేదీ రాత్రి 8.26 గంటలు, 19వ తేదీ రాత్రి 2.59 గంటలు, 20వ తేదీ రాత్రి 8.11 గంటలు, 22వ తేదీ ఉదయం 8.32 గంటలు, రాత్రి 10.30 గంటలు, 23వ తేదీ ఉదయం 8.28 గంటలు, ఉదయం 11.20 గంటలు, 25వ తేదీ ఉదయం 8.20 గంటలు, ఉదయం 11.12 గంటలు, రాత్రి 10.18 గంటలు, రాత్రి 2.36 గంటలు, 26వ తేదీ ఉదయం 8.16 గంటలు, రాత్రి 7.47 గంటలు, ఆగస్టు 30వ తేదీ రాత్రి 7.31 గంటలు, రాత్రి 9.59 గంటలు, సెప్టెంబరు 1వ తేదీ ఉదయం 7.53 గంటలు, ఉదయం 10.45 గంటలు.

Updated Date - 2021-08-09T06:08:07+05:30 IST