ఏసీబీ వలలో ఉపగణాంక అధికారి

ABN , First Publish Date - 2020-12-05T05:47:33+05:30 IST

జిల్లా సీపీవో (చీఫ్‌ ప్లానింగ్‌ ఆఫీసర్‌) కార్యాలయంలో ఉప గణాంక అధికారిగా పని చేస్తున్న ప్రదీప్‌ శుక్రవారం రూ.4వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. అవినీతి వారోత్సవాలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రదీప్‌ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుబడడం స్థానికంగా కలకలం రేపింది.

ఏసీబీ వలలో ఉపగణాంక అధికారి
ఉపగణాంక అధికారి ప్రదీప్‌ను విచారిస్తున్న ఏసీబీ అధికారులు

 రూ. 4వేల లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు

ఆదిలాబాద్‌టౌన్‌, డిసెంబరు 4: జిల్లా సీపీవో (చీఫ్‌ ప్లానింగ్‌ ఆఫీసర్‌) కార్యాలయంలో ఉప గణాంక అధికారిగా పని చేస్తున్న ప్రదీప్‌ శుక్రవారం రూ.4వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. అవినీతి వారోత్సవాలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రదీప్‌ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుబడడం స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే... ఆదిలాబాద్‌ రూరల్‌ మండలంలో 2018-19 సంవత్సరంలో ఎస్‌డీఎఫ్‌సీ నిధుల ద్వారా కాంట్రాక్టర్‌ శరత్‌ రూ. 5లక్షల విలువ చేసే సీసీ రోడ్డు పనులు చేపట్టారు. ఇందుకు సంబంధించిన చెక్కును ఎంపీడీవో కార్యాలయానికి పంపడానికి ఉప గణాంక అధికారి ప్రదీప్‌ శరత్‌ను రూ.5వేలు డిమాండ్‌ చేశారు. దీంతో కాంట్రాక్టర్‌ శరత్‌.. ఈ విషయాన్ని ఏసీబీ అధికారులకు తెలిపారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం సీపీవో కార్యాలయంలో ప్రదీప్‌కు శరత్‌ రూ.4వేల లంచం ఇస్తుండగా.. కరీంనగర్‌ రేంజ్‌ ఏసీబీ డీఎస్పీ భద్రయ్య రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నేరం రుజువైనందు వల్ల ప్రదీప్‌ను కరీంనగర్‌లో కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు. 

Updated Date - 2020-12-05T05:47:33+05:30 IST