అక్రమ కట్టడాలను పరిశీలించిన సబ్‌ కలెక్టర్‌

ABN , First Publish Date - 2021-01-23T06:49:38+05:30 IST

మండలంలోని తూముకుంట చెక్‌పోస్టులో అక్రమ కట్టడాలను శుక్రవారం పెనుకొండ సబ్‌ కలెక్టర్‌ నిషాం తి పరిశీలించారు. ఈ సందర్భంగా చెక్‌పోస్టులో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఓ నాయకుడి ఇంటిని పరిశీలించారు.

అక్రమ కట్టడాలను పరిశీలించిన సబ్‌ కలెక్టర్‌

పంచాయతీ కార్యదర్శిపై ఆగ్రహం

హిందూపురం టౌన, జనవరి 22 : మండలంలోని తూముకుంట చెక్‌పోస్టులో అక్రమ కట్టడాలను శుక్రవారం పెనుకొండ సబ్‌ కలెక్టర్‌ నిషాం తి పరిశీలించారు. ఈ సందర్భంగా చెక్‌పోస్టులో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఓ నాయకుడి ఇంటిని పరిశీలించారు. అదేవిధంగా ఓ మాజీ ప్రజాప్రతినిధి భవనాన్ని కూడా పరిశీలించారు. అయితే ని బంధనలకు విరుద్దంగా ఎలా నిర్మించారని సబ్‌ కలెక్టర్‌ వారిని ప్రశ్నించారు. అయితే సదరు నాయకుడు పంచాయతీ వారి అనుమతి తీసుకుని నిర్మించానని చెప్పడంతో కార్యదర్శి ప్రేమ్‌కుమార్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఎలా అనుమతి ఇచ్చావంటూ మందలించారు. అయితే ఎవరైనా అక్రమ కట్టడాలు నిర్మిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. వ్యవసాయ భూమిలో లేఅవుట్‌లు వేస్తే చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. అలా ఎవరైనా వేసి ఉంటే నివేదికలు పంపాలని తహసీల్దార్‌ శ్రీనివాసులు, ఎంపీడీఓ శ్రీనివాసులును ఆదేశించారు. 


Updated Date - 2021-01-23T06:49:38+05:30 IST