వ్యాక్సినేషన్‌పై సబ్‌ కలెక్టర్‌ ఆరా

ABN , First Publish Date - 2021-05-12T05:10:23+05:30 IST

నందిగాంలో కొవిడ్‌ రెండో డోసు వ్యాక్సినేషన్‌ ప్రక్రియను టెక్కలి సబ్‌ కలెక్టర్‌ సూరజ్‌ ధనుంజయ్‌ గనోరే ఆరా తీశారు. స్థానిక బీసీ బాలురు వసతిగృహంలో మంగళవారం పీహెచ్‌సీ వైద్యాధి కారి కె.అనితకుమారి పర్యవేక్షణలో కరోనా వ్యాక్సిన్‌ రెండోడోసు ప్రక్రియ ప్రారంభించారు.

వ్యాక్సినేషన్‌పై సబ్‌ కలెక్టర్‌ ఆరా
నందిగాం: వ్యాక్సినేషన్‌పై వైద్యాధికారితో చర్చిస్తున్న సబ్‌ కలెక్టర్‌ సూరజ్‌ ధనంజయ్‌ గనోరే

నందిగాం, మే 11: నందిగాంలో కొవిడ్‌ రెండో డోసు వ్యాక్సినేషన్‌ ప్రక్రియను టెక్కలి సబ్‌ కలెక్టర్‌ సూరజ్‌ ధనుంజయ్‌ గనోరే ఆరా తీశారు. స్థానిక బీసీ బాలురు వసతిగృహంలో మంగళవారం పీహెచ్‌సీ వైద్యాధి కారి కె.అనితకుమారి పర్యవేక్షణలో కరోనా వ్యాక్సిన్‌ రెండోడోసు ప్రక్రియ ప్రారంభించారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి ఎం.విజయ్‌ కుమార్‌ రాజు, తహసీల్దార్‌ ఎన్‌.రాజారావు, ఎంపీడీవో కె.ఫణీంద్రకుమార్‌, వైద్య సిబ్బంది, వీఆర్వోలు పాల్గొన్నారు.  


రెండో డోసు తప్పనిసరి

 టెక్కలి: మొదటి విడత కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేసుకున్న ప్రతి ఒక్కరు రెండో డోసు తప్పనిసరిగా నిర్దిష్ట కాలలో వేసుకోవాలని మండల ప్రత్యేకాధికారి డాక్టర్‌ మంచు కరుణాకర్‌ అన్నారు. మంగళవారం టెక్కలి, కె.కొత్తూరు, పాతనౌపడా ప్రాంతాల్లో వ్యాక్సి నేషన్‌ ప్రక్రియను పరిశీలించారు. కార్యక్రమంలో డాక్టర్‌ అంజలి, కార్యదర్శి అనిల్‌ కుమార్‌, వీఆర్వో తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు. 

 

 

Updated Date - 2021-05-12T05:10:23+05:30 IST