తుఫాను బాధిత రైతులకు 80 శాతం సబ్సిడీతో విత్తనాలు

ABN , First Publish Date - 2020-12-04T06:13:52+05:30 IST

నివర్‌ తుఫాను దెబ్బకు పంట నష్టపోయిన రైతులకు 80 శాతం సబ్సిడీతో విత్తనాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు జేడీఏ రామకృష్ణ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

తుఫాను బాధిత రైతులకు 80 శాతం సబ్సిడీతో విత్తనాలు

అనంతపురం వ్యవసాయం, డిసెంబరు 3:  నివర్‌ తుఫాను దెబ్బకు పంట నష్టపోయిన రైతులకు 80 శాతం సబ్సిడీతో విత్తనాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు జేడీఏ రామకృష్ణ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పంట వేసుకునేందుకు వరి, వేరుశనగ, కొర్ర, మినుములు, పెసలు, పప్పుశనగ విత్తనాలు సబ్సిడీతో ఇస్తామన్నారు. పంట నష్టపోయిన రైతులు స్థానిక రైతు భరోసా కేంద్రాల్లో సంప్రదించాలని సూచించారు.

Updated Date - 2020-12-04T06:13:52+05:30 IST