సినిమా,టెలివిజన్ రంగంలో మహిళల పై వేధింపుల నివారణకు సబ్ కమిటీ

ABN , First Publish Date - 2022-03-11T23:58:46+05:30 IST

సినిమా, టెలివిజన్ రంగంలో పనిచేస్తున్న మహిళలపై జరుగుతున్న వేధింపులకు అరికట్టడానికి తెలంగాణ ప్రభుత్వం ఒక సబ్ కమిటీని ఏర్పాటుచేసింది.

సినిమా,టెలివిజన్ రంగంలో మహిళల పై వేధింపుల నివారణకు సబ్ కమిటీ

హైదరాబాద్: సినిమా, టెలివిజన్ రంగంలో పనిచేస్తున్న మహిళలపై జరుగుతున్న వేధింపులను అరికట్టడానికి తెలంగాణ ప్రభుత్వం ఒక సబ్ కమిటీని ఏర్పాటుచేసింది. ఈ కమిటీ ఇచ్చే నివేదికను బట్టి ప్రభుత్వం తగిచ చర్యలు తీసుకోనుంది. కాగా శుక్రవారం సబ్ కమిటీ తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర అభివ`ద్ధి సంస్ధ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అవరవిందకుమార్ తో సమావేశమైంది. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించింది. ఈ కమిటీ రూపొందించే నివేదికను త్వరలోనే ప్రభుత్వానికి అందజేయనుంది. ఈ సమావేశంలో సభ్యులు సునీత, వసుధా నాగరాజు, ప్రీతినిగమ్, సత్యవతి, సుమిత్ర, టీఎస్ ఎఫ్ డిసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కిషోర్ బాబు, పోలీసు, కార్మికశాఖ, మహిళా,శిశు సంఓేమశాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-03-11T23:58:46+05:30 IST