వ్యాక్సినేషనను వేగవంతం చేయండి

ABN , First Publish Date - 2021-10-22T06:02:52+05:30 IST

కొవిడ్‌ వ్యాక్సిన కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని మండల స్థాయి అధికారులను పెనుకొండ సబ్‌కలెక్టర్‌ నవీనకుమార్‌ ఆదేశించారు.

వ్యాక్సినేషనను వేగవంతం చేయండి

అమరాపురం, అక్టోబరు 21: కొవిడ్‌ వ్యాక్సిన కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని మండల స్థాయి అధికారులను పెనుకొండ సబ్‌కలెక్టర్‌ నవీనకుమార్‌ ఆదేశించారు. ప్రతి ఒక్కరు మాస్కు ధరించేలా చూడాలన్నారు. హేమావతి, కె.శివరం గ్రామ సచివాలయాలను ఆయన గురువారం పరిశీలించారు. ప్రతి ఇంటికి వెళ్లి సర్వే చేయాలన్నారు. వ్యాక్సినేషనపై ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మునిస్వామి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్‌ రామకృష్ణ, పంచాయతీ కార్యదర్శి గౌరమ్మ, వీఆర్‌ఓ కిష్టప్ప, అంగనవాడీ, ఆశా కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది తదితరులు ఉన్నారు. 

Updated Date - 2021-10-22T06:02:52+05:30 IST