Abn logo
Apr 17 2021 @ 00:32AM

రీ సర్వేతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం

నూజివీడు రూరల్‌, ఏప్రిల్‌ 16: భూసమస్యల శాశ్వత పరిష్కారానికి రీ సర్వే ఏకైక మార్గమని నూజివీడు సబ్‌ కలెక్టర్‌ ప్రతిష్ట మంగైన్‌ అన్నారు. శుక్రవారం నూజివీడు మండలంలోని మీర్జాపురం హైస్కూల్‌లో భూముల రీ సర్వేపై డివిజన్‌లోని తహసీల్దార్లు, సర్వేయర్లకు రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు భూరక్ష పథకంలో 100 శాతం భూములను రీసర్వే చేయాలన్నారు. జిల్లాలో రెండేళ్లుగా రికార్డుల స్వచ్ఛీకరణ జరుగుతోందన్నారు. క్షేత్రస్థాయిలో భూములను, రికార్డులను పరిశీలించాక, ప్రతి భూమిని డ్రోన్లు, శాటిలైట్ల ద్వారా చిత్రాలను తీసి ఆన్‌లైన్‌లో పొందుపరుస్తామన్నారు. తహసీల్దార్లు ఎం.సురేష్‌కుమార్‌, విశ్వనాఽథం, భరత్‌రెడ్డి, నరసింహారావు, డివిజన్‌లోని మండల సర్వేయర్లు, డిప్యూటీ తహసీల్దార్లు పాల్గొన్నారు.


Advertisement
Advertisement
Advertisement