Abn logo
Mar 2 2021 @ 23:37PM

ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య


ఉలవపాడు, మార్చి 2 : ఇంటర్‌ విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని భీమవరం ఎస్సీ కాలనీలో మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... భీమవరం ఎస్సీ కాలనీకి చెందిన శెట్టిపల్లి బసవయ్య, కాంతమ్మ దంపతులకు ముగ్గురు కుమారుల్లో కౌశిక్‌(17) రెండవ సంతానం. వీరేపల్లి మోడల్‌ స్కూల్‌లో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. తల్లిదండ్రులు బేల్దారి పనుల నిమిత్తం వరంగల్‌ వెళ్లారు. బంధువుల ఇంట్లో ఉంటూ చదువుకుంటున్నాడు. తల్లిదండ్రులు దూరంగా ఉండడం, అప్పుడప్పుడూ కడపునొప్పి రావడంతో మనస్తాపానికి గురయ్యారు. మధ్యాహ్నం ఇం ట్లో ఫ్యాన్‌ ఉక్కుకు చీరతో ఉరివేసుకున్నాడు. ఇది గమనించిన బంధువులు కౌశిక్‌ను హుటాహుటిగా ఉలవపాడు సీహెచ్‌సీకి తీసుకొచ్చారు. అప్పటికే ఆ విద్యార్థి మృతిచెందాడు. విద్యార్థి మృతదేహాన్ని తిరిగి గ్రామానికి తీసుకెళ్లారు. ఎస్సై దేవకుమార్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. వరంగల్లు నుంచి బాలుడి తల్లిదండ్రులు వచ్చిన తరువాత పోస్టుమార్టం నిమిత్తం బాలుడు మృతదేహాన్ని సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలిస్తామని ఎస్సై చెప్పారు.

అంబవరంలోనూ...

గిద్దలూరు టౌన్‌, మార్చి 2 : పురుగు మందు తాగి ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం జరిగింది. గిద్దలూరు మండలం అంబవరం గ్రామానికి చెందిన కార్తీక్‌ (18) ఇంటర్‌ చదువుతున్నాడు. రాచర్ల సమీపంలో  చెరువుకట్టపై కార్తీక్‌ పురుగు మందు తాగి స్పృహ లేక పడి ఉన్నాడు. ఆ ప్రాం తంలోని స్థానికులు గుర్తించారు. వారి సమాచారంతో 108లో కార్తీక్‌ను గిద్దలూ రు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కార్తీక్‌ మృతిచెందాడు. మృతికి కారణాలు తెలియదు. పోలీసులు కేసు నమోదు చేశారు.


Advertisement
Advertisement
Advertisement