విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపుదిద్దుకొంటున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘లైగర్’ దాదాపు పూర్తయింది. ‘క్రాస్ బీడ్ సాలా’ అనే ట్యాగ్‌లైన్ విజయ్ దేవరకొండ పాత్ర బోల్డ్ నెస్‌ను సూచించేలా ఉంది. తాజాగా శనివారం ఈ చిత్రానికి సంబందించిన స్టన్నింగ్ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఇందులో విజయ్ దేవరకొండ దాదాపు నగ్నంగా తన దేహాన్ని ప్రదర్శించి ఆశ్చర్యపరిచారు. తను పెద్ద స్టార్ అయినా పాత్ర విషయంలో ఎటువంటి హద్దులు,సంకోచాలు ఆయన పెట్టుకోరని ఈ పోస్టర్‌తో మరోసారి స్పష్టమైంది ఈ పోస్టర్ చూసి అనుష్క, సమంత, అనన్య విజయ్ దేవరకొండ బోల్డ్ నెస్‌ను ప్రశంసిస్తూ కామెంట్లు పెట్టారు. మైక్ టైసన్ ఈ చిత్రంలో ఓ పవర్ఫుల్ పాత్ర పోషించారు. అనన్య పాండే కథానాయికగా నటించారు. ఈ చిత్రానికి నిర్మాతలు: పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా.