స్టఫ్‌డ్‌ మష్రూమ్స్‌

ABN , First Publish Date - 2020-12-26T20:10:28+05:30 IST

పుట్టగొడుగులు - 250గ్రాములు(పెద్దసైజువి), అల్లం పేస్టు - రెండు టేబుల్‌స్పూన్లు, ఉల్లిపాయ - ఒకటి, మిరియాల పొడి - అర టీస్పూన్‌, కొత్తిమీర - ఒకకట్ట, జున్ను - అరకప్పు, వెన్న - ఒక టేబుల్‌స్పూన్‌, ఉప్పు - తగినంత.

స్టఫ్‌డ్‌ మష్రూమ్స్‌

కావలసినవి: పుట్టగొడుగులు - 250గ్రాములు(పెద్దసైజువి), అల్లం పేస్టు - రెండు టేబుల్‌స్పూన్లు, ఉల్లిపాయ - ఒకటి, మిరియాల పొడి - అర టీస్పూన్‌, కొత్తిమీర - ఒకకట్ట, జున్ను - అరకప్పు, వెన్న - ఒక టేబుల్‌స్పూన్‌, ఉప్పు - తగినంత. 


తయారీ: పుట్టగొడుగులను శుభ్రం చేసుకోవాలి. ఒక పాన్‌ తీసుకొని కొద్దిగా వెన్న వేసి ఉల్లిపాయ, అల్లం పేస్టు వేసి వేగించాలి. కాసేపు వేగిన తరువాత ఉప్పు, మిరియాల పొడి వేసి కలిపి దింపాలి. చల్లారిన తరువాత జున్ను, సన్నగా తరిగిన కొత్తిమీర వేసి కలపాలి. ఈ స్టఫ్‌ను పుట్టగొడుగుల్లో కూరాలి. తరువాత ఓవెన్‌లో ఉడికించుకుని వడ్డించాలి.


Updated Date - 2020-12-26T20:10:28+05:30 IST