Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

లక్ష్యంతో చదివి ఉన్నతంగా ఎదగాలి

twitter-iconwatsapp-iconfb-icon
లక్ష్యంతో చదివి ఉన్నతంగా ఎదగాలి చందలూరు ఉన్నత పాఠశాలలో విద్యా కిట్లను అందజేస్తున్న ఆర్‌జేడీ సుబ్బారావు

ఆర్‌జేడీ సుబ్బారావు

పంగులూరు, జూలై 5: పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులు నిర్దిష్ట లక్ష్యంతో చదివి ఉన్నతంగా ఎదగా లని ఆర్‌జేడీ వీఎస్‌ సుబ్బారావు అన్నారు. మండలం లోని   చందలూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో మంగ ళవారం జగనన్న విద్యా కానుక కిట్లను ఆయన పంపి ణీ చేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు గుమ్మా శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సభలో ఆ యన మాట్లాడుతూ గత నాలుగేళ్ళుగా ఎన్‌ఎంఎంఎస్‌ పోటీ పరీక్షలో ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న విద్యార్థు లను, వారిన తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయులను అ భినందించారు. పదో తరగతిలో 589 మార్కులు సా ధించిన జయలక్ష్మి ఉమాభారతికి వెయ్యి రూపాయలు, ఎన్‌ఎంఎంఎస్‌ పోటీ పరీక్షలో అర్హత సాధించిన 26 మంది విద్యార్థులకు నగదు ప్రోత్సాహక బహుమ తులు అందజేశారు.  

కార్యక్రమంలో  సర్పంచ్‌  పెంట్యాల కిష్టారావు, కీర్తి శ్రీ, బెల్లంకొండ దశరధ, వడ్డవల్లి వీరనారాయణ, ఉపా ధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.  అనంతరం కొండమూరు ప్రాథమికోన్నత పాఠశాలలో జరుగుతున్న అదనపు తరగతి గదుల నిర్మాణ పను లను ఆర్‌జేడీ పరిశీలించారు. హెచ్‌ఎం ఆదినారా యణచౌదరి పాఠశాల ప్రగతిని విెరించారు.    

విద్యకు అధిక ప్రాధాన్యం

అద్దంకి, జూలై 5: విద్యాభివృద్ధికి  ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని నగర పంచాయతీ  చైర్‌పర్సన్‌ ఎస్తేరమ్మ అన్నారు. జగనన్న విద్యా కానుక కిట్‌లను  మంగళవారం స్థానిక శ్రీ ప్రకాశం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఆమె పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైసీపీ పట్టణ అధ్యక్షుడు కాకాని  రా ధాకృష్ణమూర్తి, పేరెంట్స్‌ కమిటీ చైర్మన్‌ పేరం  సుధా కరరెడ్డి, కొల్లా భువనేశ్వరి, హెచ్‌ఎం రాఘవరావు తది తరులు పాల్గొన్నారు. శ్రీ ప్రకాశం ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో జగనన్న విద్యా కానుక కిట్‌లను తల్లిదండ్రుల కమిటీ చైర్మన్‌ బంగారుబాబు, హెచ్‌ఎం సుబ్బయ్య  పంపిణీ చేశారు.

అద్దంకిటౌన్‌: మండలంలోని తిమ్మాయపాలెం జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యాకానుక  కిట్లను  హెచ్‌ఎం కేవీ శ్రీనివాసరావు విద్యా ర్థులకు అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల స్వచ్ఛ విద్యాలయ పురస్కార్‌ సాధించిన సందర్భంగా హెచ్‌ఎం శ్రీనివాసరావు, సీఆ ర్‌పీ ముదవర్తి రమేష్‌, గ్రామ పెద్ద తోకల వీరాంజ నేయులను ఉపాధ్యాయులు సన్మానించారు. పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్ధుల ను అభినందించారు. 

ప్రతి విద్యార్థికి కిట్‌

బల్లికురవ. జూలై 5: ప్రభుత్వ పాఠశాలలో చేరిన ప్రతి విద్యార్థికి విద్యా కానుక కిట్‌ను అందజేస్తున్నట్టు ఎంఈవో వీరరాఘ వయ్య తెలిపారు. పాఠశాలలు పునఃప్రారంభమైన  మంగళవారం మండలంలోని కొప్పెరపాడు, అంబడిపూడి, చెన్నుపల్లి గ్రామాలలో ఉన్న పాఠశాలల్లో ఎంఈవో విద్యాకానుక కిట్‌లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 6385 మంది విద్యార్థులకు విద్యాకానుక కిట్‌లు మం జూరయ్యాయని చెప్పారు. 

మార్టూరు: స్థానిక జడ్పీ హైస్కూల్లో మంగళవారం జడ్పీ వైస్‌చైర్‌పర్సన్‌ చుండి సుజ్ణానమ్మ విద్యార్థులకు విద్యా కిట్లు పంపిణీచేశారు.  కార్యక్రమంలో ఎంఈవో వస్రాం నాయక్‌, సర్పంచ్‌ భుక్యా సునీతాబాయి. ఉపసర్పంచ్‌ కాకోలు రామారావు, ప్రధానోపాధాయు డు పి.డేవిడ్‌, విద్యా కమిటీ చైర్మన్‌ గొట్టిపాటి సుబ్రమ ణ్యం, అట్లూరి సుగుణరావు, గడ్డం మస్తానవలి తది తరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

చినగంజాం, జూలై 5: విద్యార్థులకు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవా లని మున్నంవారిపాలెం సర్పంచ్‌ నల్లమోపు పద్మా వతి, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్‌ కుక్కల నాగాజు రెడ్డి అన్నారు.

మండలంలోని మున్నంవారిపాలెం ప్రాథమిక పాఠ శాలలోని విద్యార్థులకు మంగళవారం జగనన్న వి ద్యాకానుక కిట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో హెచ్‌ఎం ఎన్‌.చంద్రశేఖర్‌, ఉపాధ్యాయులు ఎస్‌.నాగ మల్లేశ్వరరావు, పి.హిమవంతేశ్వరి, బి.నాగకుమారి తదితరులు పాల్గొన్నారు. 

 మెరుగైన విద్యను అందించటమే లక్ష్యం

అడుసుమల్లి(పర్చూరు), జూలై 5: ప్రభుత్వ ప  విద్యార్థులకు మెరుగైన విద్యను అందించటమే లక్ష్యం గా ప్రభుత్వం కృషిచేస్తుందని వైసీపీ పర్చూరు నియో జకవర్గ ఇన్‌చార్జి రావి రామనాథంబాబు అన్నారు. మంగళవారం మండలంలోని అడుసుమల్లి జడ్పీ ఉన్న త పాఠశాలలో విద్యాకానుక కిట్లను ఆయన పంపిణీ చేశారు. 

ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యతోనే సమాజం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. దీన్ని విద్యార్థులు గుర్తించి బాధ్యతగా చదువుకోవాలని కోరారు. కార్యక్ర మంలో ఎంపీపీ మేకా అనందకుమారి, ఎంఈవో డి. నాగేశ్వరరావు, నాయకులు అడ్డగడ వెంకటేశ్వర్లు, సి బ్బంది పాల్గొన్నారు. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.