కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించాలి

ABN , First Publish Date - 2022-06-26T03:55:54+05:30 IST

పోటీ పరీక్షల్లో విజయం సాధిం చాలంటే అభ్యర్థులు కష్టపడి చదవాలని అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌నాయక్‌ అన్నారు. జిల్లా కేంద్రం లోని వివేకవర్ధిని డిగ్రీ, పీజీ కళాశాలలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రూప్‌ 1, 2, 3, 4, ఇతర పోటీ పరీక్షల శిక్షణ ముగింపు కార్యక్ర మంలో ఆయన మాట్లాడారు. ఉచిత కోచింగ్‌ తీసు కున్న ప్రతి అభ్యర్థి ఉద్యోగం సాధించాలని, ఇందు కోసం నిరంతరం శ్రమించాలని సూచించారు.

కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించాలి
శిక్షణ ముగింపు కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌నాయక్‌

ఏసీసీ, జూన్‌ 25: పోటీ పరీక్షల్లో విజయం సాధిం చాలంటే అభ్యర్థులు కష్టపడి చదవాలని అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌నాయక్‌ అన్నారు. జిల్లా కేంద్రం లోని వివేకవర్ధిని డిగ్రీ, పీజీ కళాశాలలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రూప్‌ 1, 2, 3, 4, ఇతర పోటీ పరీక్షల శిక్షణ ముగింపు కార్యక్ర మంలో ఆయన  మాట్లాడారు. ఉచిత కోచింగ్‌ తీసు కున్న ప్రతి అభ్యర్థి ఉద్యోగం సాధించాలని, ఇందు కోసం నిరంతరం శ్రమించాలని సూచించారు. ఉన్నత ఉద్యోగాలు సాధించి సమాజ సేవకు పునరంకితమై మార్గదర్శులుగా నిలవాలన్నారు. అనంతరం శిక్షణ తీసుకున్న వారికి ఉచిత స్టడీ మెటీరియల్‌ పంపిణీ చేశారు. సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ రవీందర్‌రెడ్డి, ఏఎస్‌డబ్ల్యూవో రవీందర్‌ , ప్రిన్సిపాల్‌ శ్రీనివాస్‌ పాల్గొన్నారు. 

అభివృద్ధి పనులను త్వరగా పూర్తిచేయాలి

హాజీపూర్‌:  అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌ నాయక్‌ పేర్కొన్నారు. శనివారం నంనూర్‌, గుడిపేట గ్రామాల్లో జరుగుతున్న  క్రీడా ప్రాంగణం పనులను, నర్సరీలను పరిశీలించారు. క్రీడా ప్రాంగణం పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. నర్సరీల్లోని మొక్కలను హరితహారానికి సిద్ధం చేయా లని పేర్కొన్నారు. అనంతరం గుడిపేటలోని మహాత్మా జ్యోతిబాపూలే రెసిడెన్షియల్‌ పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. మెను ప్రకారం ఆహారం ఇస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. కష్టపడి చదవి మంచి మార్కులు సాధించాలని సూచించారు.  ఎంపీడీవో ఎంఏ హై, ఎంపీవో శ్రీనివాసరెడ్డి, ఏపీవో మల్లయ్య, సర్పంచులు, కార్యదర్శులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-06-26T03:55:54+05:30 IST