చెట్ల కింద చదువులు

ABN , First Publish Date - 2021-10-26T04:57:26+05:30 IST

వనపర్తి మండ లంలోని దత్తాయపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థు లు చెట్లకింద చదువులు కొనసాగిస్తున్నారు.

చెట్ల కింద చదువులు
చెట్టు కింద కూర్చొని చదువుతున్న విద్యార్థులు

- శిథిలావస్థలో తరగతి గదులు  

- పెచ్చులూడుతున్న పైకప్పులు 

-  భయాందోళనలో విద్యార్థులు

వనపర్తి రూరల్‌, అక్టోబరు 25: వనపర్తి మండ లంలోని దత్తాయపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థు లు చెట్లకింద చదువులు కొనసాగిస్తున్నారు.  పాఠశా ల తరగతి గదులు పూర్తిగా శిథిలావస్థకు చేరడంతో గదులలోకి వెళ్లాలంటేనే  విద్యార్థులు భయాందోళన చెందుతున్నారని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వాపోతున్నారు. మూడు నెలల క్రితం శిథిలావస్థలో ఉన్న వరండాలో కూర్చుని చదువుతుండగా  పైకప్పు పెచ్చులు ఊడాయని, ఆ సమయంలో ఎవరికీ ప్ర మాదం జరగలేదని వారు తెలిపారు.  రెండు నెలలు గడవక ముందే మళ్లీ అదే సమస్య పునరావృతం అయ్యింది. దసరా పండుగ సెలవులు అనంతరం పాఠశాలలో ప్రారంభం కావడంతో శనివారం అంద రూ విద్యార్థులు వరండాలో చదువుతుండగా  పైకప్పు నుంచి పెచ్చులు పడ్డాయి కానీ ఎవరికీ ఎ లాంటి ప్రమాదం జరగలేదు.  వరండాలోకి వెళ్లాలం టేనే మా పిల్లలు బయపడుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో చేసేదేమీ లేక హెచ్‌ఎం  విద్యార్థులను చెట్లకింద కూర్చొబెట్టి విద్యాబోధన అందిస్తున్నారు. శిథిలావస్థ కు చేరుకున్న భవనాన్ని మరమ్మతు చేసి విద్యా ర్థులకు మెరుగైన బోధన అందించేందుకు గ్రామ సర్పంచ్‌, అధికారులు కృషి చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్థులు కోరుతున్నారు.

Updated Date - 2021-10-26T04:57:26+05:30 IST