బురదతో విద్యార్థులకు తప్పని తిప్పలు

ABN , First Publish Date - 2022-07-04T03:46:26+05:30 IST

మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు బురదతో ఇబ్బందులు తప్పడం లేదు. వర్షం వస్తే ఒక వైపుబురద, మరోవైపు మిషన్‌ భగీరథ పైపు లైన్‌ కోసం తవ్వి వది లివేసిన గుంతతో ఇబ్బందులు పడాల్సి వస్తోందని విద్యార్థులు వాపోతున్నారు.

బురదతో విద్యార్థులకు తప్పని తిప్పలు
పాఠశాల ఆవరణలో ఉన్న బురద

దహెగాం, జూలై 3: మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు బురదతో ఇబ్బందులు తప్పడం లేదు. వర్షం వస్తే ఒక వైపుబురద, మరోవైపు మిషన్‌ భగీరథ పైపు లైన్‌ కోసం తవ్వి వది లివేసిన గుంతతో ఇబ్బందులు పడాల్సి వస్తోందని విద్యార్థులు వాపోతున్నారు. కాలు జారితే మిషన్‌ భగీరథ గుంతలో పడతామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమీపంలోనే పంచాయతీ, ఎంపీడీవో కార్యాలయాలు ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి మిషన్‌ భగీరథ పైపులైన్‌ గుంత పూడ్చి బురదలేకుండా చర్యలు చేపట్టాలని విద్యార్థులు కోరుతున్నారు.

Updated Date - 2022-07-04T03:46:26+05:30 IST