హైస్కూల్‌.. ఫ్లస్‌లలో ఇంటర్‌ విద్యార్థులు హైరానా

ABN , First Publish Date - 2022-09-22T20:47:16+05:30 IST

ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల ఇంటర్‌ విద్యార్థులు(Inter students) నలిగి పోతున్నారు. ముఖ్యంగా నూతన విద్యా విధానంలో భాగంగా ఇంటర్మీడియట్‌ విద్య(Intermediate education)ను హైస్కూల్‌ ప్లస్‌ పేరిట ఎంపిక చేసిన

హైస్కూల్‌.. ఫ్లస్‌లలో ఇంటర్‌ విద్యార్థులు హైరానా

తాజా ఉత్తర్వుల్లోనూ నియామకాల ఊసెత్తని ప్రభుత్వం

పాఠ్య పుస్తకాల కోసం ఇండెంట్‌ పంపిన విద్యాశాఖ

ఆంగ్ల మాధ్యమం మాకొద్దంటూ టీసీలు తీసుకెళ్లిపోతున్న విద్యార్థులు


ఏలూరు ఎడ్యుకేషన్‌, సెప్టెంబరు 21 : ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల ఇంటర్‌ విద్యార్థులు(Inter students) నలిగి పోతున్నారు. ముఖ్యంగా నూతన విద్యా విధానంలో భాగంగా ఇంటర్మీడియట్‌ విద్య(Intermediate education)ను హైస్కూల్‌ ప్లస్‌ పేరిట ఎంపిక చేసిన ఉన్నత పాఠశాలల్లో ప్రారంభించి దాదాపు మూడు నెలలు గడుస్తున్నా విద్యార్థులకు ఇప్పటికీ పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయకపోవడం, అధ్యాపకుల నియామ కాలు లేక బోధన ప్రశ్నార్థకం కావడంతో వీటిలో చేరిన విద్యార్థులు ఒక్కొక్కరుగా టీసీలు తీసుకుని ఇతర కళాశాలలకు వెళ్ళిపోతున్నారు. తాజాగా బుదవారం జారీ చేసిన ఉత్తర్వు ల్లోను అధ్యాపకుల విద్యార్హతలపై మార్గదర్శకాలు విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ(School Education Department) నియామకాలను చేపట్టే విషయ మై స్పష్టత ఇవ్వలేదు. దీంతో హైస్కూల్‌ ప్లస్‌లలో చేరిన ఇంటర్‌ విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంలా తయారైంది.


బోధనా సిబ్బంది విద్యార్హతలతో సరి

ఏలూరు జిల్లాలో 25చోట్ల ఇంటర్‌ విద్యతో హైస్కూల్‌ ప్లస్‌ పేరిట ప్రస్తుతమున్న ఉన్నత పాఠశాలలను అప్‌గ్రేడ్‌ చేస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు ఇంటర్‌బోర్డు పర్యవేక్షించే జూనియర్‌ కళాశాలలన్నీ ఈ ఏడాది జూలై ఒకటో తేదీ నుంచే తరగతులను ప్రారంభించగా, హైస్కూల్‌ ప్లస్‌లలో మాత్రం ప్రవేశాలు దాదాపు నెలన్నర రోజులు ఆల స్యమయ్యాయి. ఇక బోధనా సిబ్బంది నియామకాల గురించి బుదవారం విడుదల చేసిన మార్గదర్శకాల్లో కేవలం మొక్కుబ డిగా వివరణ ఇచ్చిందే తప్ప ఎప్పటిలోగా అధ్యాపకుల నియా మకాలు పూర్తిచేస్తారో స్పష్టత ఇవ్వలేదు. ఆ ప్రకారం ఎంపీసీ, బైపీసీ, సీఈసీ గ్రూపులతో ప్రారంభించిన హైస్కూల్‌ ప్లస్‌లలో ఏవైనా రెండు గ్రూపులు, సెక్షన్‌కు కనీస విద్యార్థుల సంఖ్య 20 మంది ఉండాలన్న షరతు విధించారు. ఇక ప్రస్తుతం ఈ హైస్కూళ్ళలో పనిచేస్తోన్న ఉపాధ్యాయులతోనే ఇంటర్‌ విద్య ను బోధింపజేస్తున్నారు. తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం మూడు గ్రూపులకు బోధించేందుకు పీజీ విద్యార్హతలున్న హైస్కూలు ఉపాధ్యాయుల నుంచి అన్ని సబ్జెక్టులకు కలిపి మొత్తం 8 మంది చొప్పున ఆయా సబ్జెక్టు టీచర్లకు పదోన్నతి ఇవ్వడం ద్వారా హైస్కూల్‌ ప్లస్‌లలో నియమిస్తారు. జిల్లాలో అప్‌గ్రేడ్‌ అయిన 25 హైస్కూల్‌ ప్లస్‌లలో మొత్తం 200 మంది అధ్యాపకులను నియమించాల్సి ఉంది. వీరికి ఒక ఇంక్రిమెంట్‌ ఇచ్చి పీజీటీ (పోస్ట్‌ గ్రాడ్యుయేష న్‌ టీచర్‌)గా నియమిస్తారు. ఇదిలా ఉండగా జిల్లాలో పీజీ టీలుగా పదోన్నతి పొందేందుకు ఆసక్తి కనబరుస్తున్న హైస్కూ లు ఉపాధ్యాయుల్లో విచిత్ర పరిస్థితి నెలకొంది. విద్యార్థుల సంఖ్య బాగా తక్కువగా ఉండటం, ఇదే పరిస్థి తి వచ్చే ఏడాది కొనసాగితే తమను వేరే చోటకు పంపిచేస్తారేమోనన్న ఆందోళన టీచర్లను వెంటాడు తున్నాయి. త్వరలో జరగను న్న బదిలీల్లో 5/8 ఏళ్ళు ఒకే స్కూలులో పనిచేసి తప్ప ని సరిగా మరో స్కూలు కు బదిలీ కావాల్సిన టీచర్లు, రేషనలైజేషన్‌లో తమ సబ్జెక్టు పోస్టు వేరే మండలానికి లేదా స్కూ లుకు షిఫ్ట్‌ అయిన పరిస్థి తుల్లోవున్న వారు పీజీటీలు గా వెళ్ళేందుకు ఒకింత తప్ప నిసరి సందర్భాల్లో మాత్రమే ఆసక్తి కనబరుస్తున్నారు. కాగా పీజీటీల పదోన్నతులకు ఇప్పటికీ సంబందిత విద్యార్హతలున్న స్కూల్‌ అసిస్టెంట్ల నుంచి ప్రభుత్వం ఆప్షన్లు తీసుకునే ప్రక్రియను ప్రారంభించ లేదు.


తరలిపోతున్న విద్యార్థులు  

ఆంగ్లమాద్యమ బోధనపట్ల ఆసక్తి కనబరచని విద్యార్థులు ఇతర కళాశాలలకు తరలి వెళ్ళిపోతున్నారు. ఆ మేరకు తమ పిల్లలకు టీసీలు ఇచ్చేయాల్సిందిగా హెచ్‌ఎంలపై తల్లిదం డ్రులు ఒత్తిడి తెస్తున్నారు. ఇవిగాక మిగతా హైస్కూల్‌ ప్లస్‌లలో విద్యార్థుల సంఖ్య ఒక్కో గ్రూప్‌/సెక్షన్‌కు 1 నుంచి 5లోపే ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికివున్న విద్యార్థులకైనా బోధించేందుకు వీలుగా అవసరమైన పాఠ్య పుస్తకాల కోసం ఇండెంట్‌ను విద్యా శాఖ కమిషనర్‌ ఆదే శాల మేరకు జిల్లా విద్యా శాఖ బుధవారం పంపగా, ఆ మేరకు పుస్తకాలు విద్యా ర్థులకు ఎప్పటికి చేరతాయో, బోధనా సిబ్బంది నియామకాలు ఇంకెంత కాలానికి పూర్తవుతాయో అగమ్యగోచరంలా హైస్కూల్‌ ప్లస్‌లలో ఇంటర్‌ విద్య తయారైంది. 

Updated Date - 2022-09-22T20:47:16+05:30 IST