విదేశాలకు వెళ్లే విద్యార్థులకు టీకా స్పెషల్ డ్రైవ్ ముగిసింది

ABN , First Publish Date - 2021-06-18T04:53:00+05:30 IST

విదేశాలకు వెళ్లే విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ముగిసింది. ఇప్పటి వరకు 13వేల మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. అయితే వాక్‌ఇన్‌లో కూడా వ్యాక్సిన్ అందిస్తామని అ

విదేశాలకు వెళ్లే విద్యార్థులకు టీకా స్పెషల్ డ్రైవ్ ముగిసింది

హైదరాబాద్: విదేశాలకు వెళ్లే విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ముగిసింది. ఇప్పటి వరకు 13వేల మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. అయితే వాక్‌ఇన్‌లో కూడా వ్యాక్సిన్  అందిస్తామని అధికారులు చెప్పారు. ఇతర దేశాల్లోని విశ్వవిద్యాలయాలు, అంతర్జాతీయ విద్యార్థులకు వ్యాక్సినేషన్ తప్పనిసరి చేశాయి. ఈ క్రమంలో ఉన్నత చదువుల కోసం వెళ్లే విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియను చేపట్టింది. ఈ నెల 5వ తేదీ నుంచి నారాయణగూడ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రీవెంట్ మిడిసిన్  (ఐపీఎమ్)లో వ్యాక్సినేషన్ ప్రారంభించింది. స్లాట్ బుక్ చేసుకున్నవారు ఐపీఎమ్‌కు వచ్చి వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. తొలిరోజు 7వేల మంది విద్యార్థులు బుక్ చేసుకున్నారని అధికారులు తెలిపారు. 


Updated Date - 2021-06-18T04:53:00+05:30 IST