విద్యార్థులను భావి పౌరులుగా తీర్చిదిద్దాలి

ABN , First Publish Date - 2022-08-17T05:59:41+05:30 IST

విద్యార్థులకు పాఠశాల స్థాయి నుంచే సంస్కారం నేర్పాలని, భావి పౌరులుగా తీర్చిదిద్దాలని అదనపు ఎస్పీ చంద్రయ్య అన్నారు. మంగళవారం జిల్లా గ్రంథాలయంలో స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా డీపీఆర్వో మామిండ్ల దశరథం అధ్యక్షతన కవిసమ్మేళనం నిర్వహించారు.

విద్యార్థులను భావి పౌరులుగా తీర్చిదిద్దాలి
కవులను సన్మానిస్తున్న అదనపు ఎస్పీ

సిరిసిల్ల ఎడ్యుకేషన్‌, ఆగస్టు 16: విద్యార్థులకు పాఠశాల స్థాయి నుంచే సంస్కారం నేర్పాలని, భావి పౌరులుగా తీర్చిదిద్దాలని  అదనపు ఎస్పీ చంద్రయ్య అన్నారు. మంగళవారం  జిల్లా గ్రంథాలయంలో స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా  డీపీఆర్వో మామిండ్ల దశరథం అధ్యక్షతన కవిసమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ చంద్రయ్య మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో పిల్లలతో పెద్దవారికి  సంబంధాలు లేకుండా పోతున్నాయని, వారికి అనుబంధాల గురించి నేర్పడం లేదని అన్నారు. ఇవి నేర్పడం వల్ల వారికి ఒక అందమైన జీవితం ఏర్పడుతుందన్నారు. అనంతరం డీపీఆర్‌వో దశరథం మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధులను స్మరించుకుంనేందుకు వజ్రోత్సవాలు జరుపుకుంటున్నామన్నారు.   డీఈవో రాధాకిషన్‌ మాట్లాడుతూ జాతిని జాగృత పరిచేది కవులేనని,  సమాజంలో మార్పును తీసుకురావడానికి కృషి చేయాలని అన్నారు.  గ్రంథాలయ చైర్మన్‌ ఆకునూరి శంకరయ్య, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు గడ్డం నర్సయ్య, తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడు జూకంటి జగన్నాధం, మానేరు రచయితల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎలగొండ రవి, ప్రధాన కార్యదర్శి టీవీ నారాయణ, వాసరవేణి పర్శరాములు, గోనే బాల్‌రెడ్డి, ఆడెపు లక్ష్మణ్‌, కవులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-17T05:59:41+05:30 IST