విద్యార్థులను బాలశాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలి : డీఈవో

ABN , First Publish Date - 2022-08-17T06:37:33+05:30 IST

విద్యార్థుల ను బాలశాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలని, ఇందుకోసం ఇన్‌స్పైర్‌ మానక్‌ అవార్డ్స్‌ ఎంతగానో దోహదపడతాయని జిల్లా విద్యాశాఖ అధికారి బొల్లారం భిక్షపతి అన్నారు. మంగళవారం డైట్‌ కళాశాల లో దేవరకొండ డివిజన్‌ పరిధిలోని సైన్స్‌ ఉపాధ్యాయులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు.

విద్యార్థులను బాలశాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలి : డీఈవో
సమావేశంలో మాట్లాడుతున్న డీఈవో భిక్షపతి

నల్లగొండ, ఆగస్టు 16: విద్యార్థుల ను బాలశాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలని, ఇందుకోసం ఇన్‌స్పైర్‌ మానక్‌ అవార్డ్స్‌ ఎంతగానో దోహదపడతాయని జిల్లా విద్యాశాఖ అధికారి బొల్లారం భిక్షపతి అన్నారు. మంగళవారం డైట్‌ కళాశాల లో దేవరకొండ డివిజన్‌ పరిధిలోని సైన్స్‌ ఉపాధ్యాయులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. జిల్లాలోని 6 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల నుంచి ఐదు ప్రాజెక్ట్‌లు స్వీకరించాలన్నారు. వీటిలో ఉత్తమ ప్రాజెక్టులను నేషనల్‌ ఇన్నోవేషన్‌ ఫౌండేషన్‌ ద్వారా ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. జిల్లాను రాష్ట్రస్థాయిలో ముందు వరుసలో ఉంచాలన్నారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్‌ అధికారి వనం లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-17T06:37:33+05:30 IST