విద్యార్థులు సైబర్‌ నేరాల గురించి పూర్తి అవగాహన కలిగి ఉండాలి : కలెక్టర్‌

ABN , First Publish Date - 2022-08-12T07:32:13+05:30 IST

విద్యార్థులకు సైబర్‌ నేరాల గురించి పూర్తి అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ అన్నారు.

విద్యార్థులు సైబర్‌ నేరాల గురించి పూర్తి అవగాహన కలిగి ఉండాలి : కలెక్టర్‌
జ్యోతి ప్రజ్వలన చేస్తున్న కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ

నిర్మల్‌ టౌన్‌, ఆగస్టు 11 : విద్యార్థులకు సైబర్‌ నేరాల గురించి పూర్తి అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఆర్‌కే కన్వెన్షన్‌ హాల్‌లో ‘సైబర్‌ కాంగ్రెస్‌ గ్రాండ్‌ ఫినాలే’ సమావేశం జిల్లా ఇన్‌చార్జి ఎస్పీ కిరణ్‌ఖారే ఐపీఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా కలెక్టర్‌ జ్యోతి ప్రజ్వలన చేసి, విద్యార్థిని విద్యార్థులకు సైబర్‌ నేరాలు, మహిళా నేరాల గురించి అవ గాహనను కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. ఈ సంద ర్భంగా ఇన్‌చార్జి ఎస్పీ మాట్లాడుతూ... సెల్‌ఫోన్లు, అంతర్జాలం, ఆన్‌లైన్‌ వేదికల వినియోగం పెరుగుతున్న కొద్దిసైబర్‌ నేరాల సంఖ్య పెరుగు తోంది. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు హేమంత్‌ బోర్కడే, రాంబాబు, డీఈవో ఏ.రవీందర్‌రెడ్డి, డీఎస్పీ జీవన్‌రెడ్డి, సీఐలు శ్రీనివాస్‌, వెంకటేష్‌, షీ టీం ఎస్సై సుమన్‌రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు, షీటీం సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-12T07:32:13+05:30 IST