సైబర్‌ నేరాలను విద్యార్థులు పసిగట్టాలి

ABN , First Publish Date - 2022-08-12T04:51:21+05:30 IST

సైబర్‌ నేరాలు, మహిళా నేరా లను విద్యార్థులు పసిగట్టాలని కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌బాషా అన్నారు.

సైబర్‌ నేరాలను విద్యార్థులు పసిగట్టాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌బాషా

- కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌బాషా 


వనపర్తి క్రైమ్‌, ఆగస్టు 11: సైబర్‌ నేరాలు, మహిళా నేరా లను విద్యార్థులు పసిగట్టాలని కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌బాషా అన్నారు. జిల్లా కేంద్రంలోని సాయి గార్డెన్‌ ఫంక్షన్‌ హాల్‌లో సైబర్‌ నేరాలపై ఉమెన్‌ సెఫ్టీ వింగ్‌ తెలంగాణ పోలీస్‌, స్కూల్‌ ఎడ్యుకేషన్‌ డిపార్ట్‌మెంట్‌ ఆధ్వర్యంలో, అదనపు ఎస్పీ షాకీర్‌ హుస్సేన్‌, జిల్లా పోలీస్‌ షీటీమ్స్‌ పర్యవేక్షణలో నిర్వహించిన సైబర్‌ కాంగ్రెస్‌ గ్రాం డ్‌ ఫినాలే కార్యక్రమాన్ని కలెక్టర్‌ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ సైబర్‌ నేరాలపై తీసుకునే జాగ్రత్తల గురించి విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో ప్రతిభ కనబర్చిన మొదటి ముగ్గురు విద్యార్థులకు బహుమతులు అందించారు. అనంతరం ఏఎస్పీ  విద్యార్థినీ, విద్యార్థులకు సైబర్‌ నేరాలు, మహిళా నేరాల గురించి అవగాహన కల్పించారు. సెల్‌ఫోన్లు, కంప్యూటర్లు, ఆన్‌లైన్‌ వినియోగం పెరుగుతున్న కొద్ది సైబర్‌ నేరాల సంఖ్య పెరుగుతోందని, మహిళలు, పిల్లలే లక్ష్యంగా సైబర్‌ మోసాలు, వేధింపులు అధికమవుతున్నా యన్నారు.  సైబర్‌ కాంగ్రెస్‌లో నేర్చుకున్న విష యాల్ని అంబాసిడర్లు తోటి విద్యార్థులకు, తల్లి దండ్రులకు, సమాజానికి అవగాహన కల్పించా లన్నారు. సమావేశంలో డీఈవో రవీందర్‌, జీసీడీవో సుబ్బలక్ష్మి, జిల్లా యాంటీ హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ఎస్సై అంజద్‌, జిల్లా షీటీం ఎస్సై స్వాతి, సైబర్‌ క్రైమ్‌ ఎస్సై వేణు, ఎస్పీ పీఆర్‌వో రాజగౌడ్‌, షీటీమ్స్‌ సిబ్బంది శ్రీనివాసులు, కృష్ణ, వెంకటస్వామి, రమేష్‌, ఐటీ కోర్‌ సిబ్బంది, గోవింద్‌, రవీందర్‌బాబు, విజయ్‌, జిల్లాలోని వివి ధ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు, పోలీ స్‌ సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-12T04:51:21+05:30 IST