విద్యార్థినులు సత్తా చాటాలి

ABN , First Publish Date - 2022-05-21T05:41:37+05:30 IST

నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థినులు అన్ని రంగాల్లో సత్తా చాటాలని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జీఎం సుందరవల్లి పిలుపునిచ్చారు.

విద్యార్థినులు సత్తా చాటాలి
డిగ్రీ పట్టా అందజేస్తున్న వీసీ సుందరవల్లి

వీఎస్‌యూ వీసీ ఆచార్య సుందరవల్లి 

డీకేడబ్ల్యూలో ఘనంగా గ్రాడ్యుయేషన్‌ డే


నెల్లూరు (విద్య), మే 20  : నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థినులు అన్ని రంగాల్లో  సత్తా చాటాలని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జీఎం సుందరవల్లి పిలుపునిచ్చారు. నెల్లూరులోని డీకే ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో శుక్రవారం గ్రాడ్యుయేషన్‌ డేను ఘనంగా నిర్వహించారు. వీసీ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఆధునిక సమాజానికి అనుగుణంగా విద్యార్థినులు, మహిళలు విద్యలో ప్రతిభ చాటడం శుభ పరిణామమన్నారు. మహిళలు కలలను సాకారం చేసుకునేందుకు విద్య ఎంతో దోహదం చేస్తుందన్న తెలిపారు. ప్రతి ఒక్కరి జీవితంలో గ్రాడ్యుయేషన్‌ పట్టా అందుకోవడం మరపురాని సంఘటనగా గుర్తిండిపోతుందన్నారు. డీకేడబ్ల్యూ కళాశాలలో అత్యున్నత ప్రమాణాలతో విద్యనందించడంతోపాటు విద్యార్థినుల ఉన్నతికి ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. స్వయం ప్రతిపత్తి హోదా అనంతరం తొలిసారిగా ఈ వేడుకలను నిర్వహించడం అభినందనీయమన్నారు. కళాశాల విద్య రీజనల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ వీ రమా జ్యోత్న్స కుమారి మాట్లాడుతూ గ్రాడ్యుయేషన్‌ డే విద్యార్థినుల జీవితంలో కీలకమైనదని, కుటుంబం, సమాజం ఎంతో గర్వించే రోజుగా గుర్తిండిపోతుందన్నారు. అనంతరం 2016-17, 2017-18 అకడమిక్‌ బ్యాచ్‌లకు చెందిన విద్యార్థినులకు డిగ్రీ పట్టాలను అందచేశారు. ఈ కార్యక్రమంలో  కోవూరు డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సీ లక్ష్మీ ప్రసూన, డీకేడబ్ల్యూ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ డీ గిరి, కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ డాక్టర్‌ పీ విక్టోరియా రాణి, అసిస్టెంట్‌ కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ కే సాయిసుధ, సిబ్బంది పాల్గొన్నారు.


బంగారు పతకాల విజేతలు..

గ్రాడ్యుయేషన్‌ డేలో  2016-19, 2017-20 బ్యాచ్‌లలో అన్ని కోర్సుల్లో అగ్రస్థానంలో నిలిచిన విద్యార్థినులకు వీఎస్‌యూ వీసీ సుందరవల్లి బంగారు పతకాలు ప్రదానం చేశారు. 2016-19 బ్యాచ్‌లో ఎం ఉదయశ్రీ(బీఎస్సీ-ఎంపీసీ), ఎం వైష్ణవి(బీఎస్సీ- బయో టెక్‌), వీ వసంతబాయి (బీఎస్సీ-ఎంపీసీఎస్‌), ఎస్‌కేఅఫ్రోజ్‌భాను(బీఎస్సీ-హామ్‌సైన్స్‌), బీ మౌనిక(బీఎస్సీ-ఎంఎస్‌సీ ఎస్‌), సీ అరుణ(బీఎస్సీ- బీజెడ్‌సీ), పీ సౌజన్య(బీఎస్సీ- మైక్రోబయాలజీ), కే చైత్రాలి(బీకామ్‌-సీఏ), వీ లక్ష్మీ(బీఏ-హెచ్‌ఈసీఈ), కే సంధ్య(బీఏ- హెచ్‌ఈపీ), జీ ఉషా రాణి(బీఏ-ఈపీటీ)లకు బంగారు పతకాలు అందచేశారు. 

2017-20 బ్యాచ్‌లో కే సుష్మాస్వరూప (బీఎస్సీ- ఎంపీసీఎస్‌), ఎస్‌ బ్యూలా(బీఎస్సీ- ఎంఎస్‌సీఎస్‌), పీ అలేఖ్యమంజరి(బీఎస్సీ-బీజెడ్‌సీ), ఎం నిఖితాపాల్‌(బీఎస్సీ-ఆక్వా), ఎల్‌ హరిప్రియ(బీఎస్సీ-బయోటెక్‌), ఎస్‌కే సోఫియా(బీఏ-హెచ్‌ఈపీ), ఏ తులసి(బీఏ- ఈపీటీ) టీ కల్యాణి(బీఎస్సీ- హామ్‌సైన్స్‌), సీహెచ్‌ శ్రీసాయిశృతి(బీఏ-హెచ్‌ఈసీఈ), కే పద్మ(బీఎస్సీ-ఎంపీ ఆర్‌ఈ), వినోదిని బాగీ(బీకామ్‌-సీఏ), అస్రిన్‌ పఠాన్‌ (బీఎస్సీ- ఎంపీసీ), జీ ఉమాభారతి (బీఎస్సీ-మైక్రోబయాలజీ) బంగారు పతకాలు అందుకున్నారు. 

 

విద్యతోనే మహిళాభివృద్ది - 1 

 నగర మేయర్‌ స్రవంతి 

నెల్లూరు (విద్య), మే 20  : విద్యలో ఉత్తమంగా రాణిస్తేనే మహిళాభివృద్ధి సాధ్యమవుతుందని నగర మేయర్‌ పీ స్రవంతి పేర్కొన్నారు. డీకే కళాశాలలో శుక్రవారం  సాయంత్రం నిర్వహించిన వార్షికోత్సవానికి ఆమె అతిథిగా హాజరై ప్రసంగించారు. మహిళల కోసమే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ కళాశాల నుంచి ఎంతోమంది ఉన్నత శిఖరాలు అధిరోహించారన్నారు. డీవీఈవో, డీకేడబ్ల్యూ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఏ శ్రీనివాసులు మాట్లాడుతూ అధ్యాపక బృందం సమష్టిగా కృషి చేసి కళాశాల ఉన్నతికి పాటుపడాలని కోరారు. అనంతరం 2020-21 విద్యా సంవత్సరంలో ఉత్తమ ప్రతిభ చూ పిన విద్యార్థినులకు బహుమతులు అందచేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాం స్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో కళాశాల గవర్నింగ్‌ బాడీ సభ్యురాలు ఎం గౌరి, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ డీ గిరి, వైస్‌ ప్రిన్సిపాల్‌ ఏవీ రమణరావు, ఎండోమెంట్‌ డోనర్‌ వరలక్ష్మి, కార్పొరేటర్‌ వై వాసంతి, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-21T05:41:37+05:30 IST