మావయ్యా.. విలీనాన్ని ఆపయ్యా

ABN , First Publish Date - 2022-09-24T19:36:47+05:30 IST

పాఠశాల విలీనాన్ని(School merger) వ్యతిరేకిస్తూ రోజుల తరబడి నిరసన తెలుపుతున్న విద్యార్థులు శుక్రవారం మరో అడుగు ముందుకు వేశారు. ‘జగన్‌ మామయ్యా.. మా పాఠశాల విలీనాన్ని ఆపండి...’ అని ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు.

మావయ్యా.. విలీనాన్ని ఆపయ్యా

మాయదార్లపల్లిలో జగన్‌ ఫొటోతో విద్యార్థుల నిరసన


కుందుర్పి, సెప్టెంబరు 23: పాఠశాల విలీనాన్ని(School merger) వ్యతిరేకిస్తూ రోజుల తరబడి నిరసన తెలుపుతున్న విద్యార్థులు శుక్రవారం మరో అడుగు ముందుకు వేశారు. ‘జగన్‌ మామయ్యా.. మా పాఠశాల విలీనాన్ని ఆపండి...’ అని ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. అనంతపురం జిల్లా కుందుర్పి మండలం మాయదార్లపల్లి ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులు 67 రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆ పాఠశాలలోని 6, 7, 8 తరగతులను బసాపురం ఉన్నత పాఠశాలో విలీనం చేశారు. సుమారు ఏడు కి.మీ. దూరంలో ఉన్న పాఠశాలకు వెళ్లడం ఇబ్బందికరమని తల్లిదండ్రులు అభ్యంతరం తెలిపారు. అధికారులు స్పందించకపోవడంతో పాఠశాల ప్రధాన ద్వారాన్ని మూసివేశారు. అప్పటి నుంచి ఉపాధ్యాయులు ఆరుబయటే పాఠాలను చెబుతున్నారు. అధికారులు స్పందించకపోవడంతో సీఎం జగన్‌ చిత్రపటాన్ని(CM Jagan picture) ముందు ఉంచుకుని విద్యార్థులు నిరసనకు దిగారు.  



Updated Date - 2022-09-24T19:36:47+05:30 IST