కొవ్వొత్తులతో నిరసన తెలుపుతున్న విద్యార్థులు
ఎచ్చెర్ల: కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై అంబేడ్కర్ యూనివర్సిటీలో మంగళవారం ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. హాస్టల్ నుంచి ప్రధాన గేటు వరకు ర్యాలీ నిర్వహించారు. అగ్నిపథ్ పథకాన్ని ఉపసంహరించుకోవాలని నినాదాలు చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన రాకేష్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు బలగ ప్రశాంత్, కుమ్మరి బలరాం, పొగిరి ఉమ, తదితరులు పాల్గొన్నారు.