‘లంక’ దాటాలంటే ఎంత కష్టం!

ABN , First Publish Date - 2021-11-08T14:15:26+05:30 IST

చుట్టూ నీరు.. మధ్యలో లంక..

‘లంక’ దాటాలంటే ఎంత కష్టం!

‘ఆంధ్రజ్యోతి’ వద్ద గోడు వెళ్లబోసుకున్న విద్యార్థులు


అవనిగడ్డ టౌన్‌/రూరల్‌: చుట్టూ నీరు.. మధ్యలో లంక.. కృష్ణా నదికి వరదలు వచ్చినప్పుడల్లా కాజ్‌వే రహదారి కొట్టుకుపోతుంది. రోజూనది దాటి స్కూల్‌కు వెళ్లే విద్యార్థులతోపాటు, వృద్ధులు, బాలింతలు, ఇతర కూలీలు ఊరు దాటడానికి అష్టకష్టాలు పడాల్సిందే. నదీ గర్భంలోని పాత ఎడ్లంక గ్రామస్థుల దీనావస్థ ఇది!. ఆ ప్రాంతంలో జరుగుతున్న ఇసుక తవ్వకాలను పరిశీలించేందుకు శనివారం వెళ్లిన ‘ఆంధ్రజ్యోతి, ఏబీఎన్‌’ బృందానికి.. ప్రమాదకరంగా ఉన్న నదిలోని తాటిపట్టె వంతెనపై దాటుతున్న విద్యార్థులు కనిపించి తమ గోడును వెళ్ల్లబోసుకున్నారు. మూడేళ్లుగా తాము నదిని దాటేందుకు ఎన్ని ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నదిలో ఇసుక తవ్వకాల వల్లే రోడ్లు కొట్టుకుపోయాయని, గ్రామం చుట్టూ గట్టు కోతకు గురవుతూ గ్రామమే కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడిందని గ్రామస్థులు వాపోతున్నారు. ఇప్పటికైనా ఇసుక అక్రమ తవ్వకాలను ఆపి, గ్రామానికి కాజ్‌వే నిర్మించాలని ఎడ్లంక వాసులు కోరుతున్నారు.

Updated Date - 2021-11-08T14:15:26+05:30 IST