విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించాలి

ABN , First Publish Date - 2022-08-09T07:03:13+05:30 IST

విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ (డీఎల్‌ఎస్‌ఏ) కార్యదర్శి, న్యాయమూర్తి కె.ప్రత్యూషకుమారి అన్నారు.

విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించాలి
నృత్యం చేస్తున్న కళాకారిణులు

  • డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి, న్యాయమూర్తి ప్రత్యూషకుమారి
  • ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమాలు

రాజమహేంద్రవరం సిటీ, ఆగస్టు 8: విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ (డీఎల్‌ఎస్‌ఏ) కార్యదర్శి, న్యాయమూర్తి కె.ప్రత్యూషకుమారి అన్నారు. ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమంలో భాగంగా సోమవారం డీఎల్‌ఎస్‌ఏ ఆధ్వర్యంలో స్థానిక కంటిపూడి రామారావు కార్పొరేషన్‌ హైస్కూల్‌లో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. దీనికి ఆమె ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడుతూ చిన్నప్పటి నుంచి విద్యార్థులు దేశభక్తిని అలరచుకునేవిధంగా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కృషి చేయాలన్నారు. దేశంలో కోసం జీవితాలు త్యాగం చేసిన వారి చరిత్రలు తెలియజేయాలని ప్రత్యూషకుమారి అన్నారు.

ఆకట్టుకుంటున్న సాంస్కృతిక కార్యక్రమాలు 

స్థానిక శ్రీవెంకటేశ్వరా ఆనం కళాకేంద్రలో కళాకారిణులు, విద్యార్థులు  ప్రదర్శిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకుంటున్నాయి. శ్రీలలిత కళానృత్య నికేతన్‌ ఆధ్వర్యంలో సాంప్రదాయ నృత్యాలు, శివసాయి కూచినృత్యకళాక్షేత్రం టి.సాయి మాధవీ బృందం ప్రదర్శనలు అద్భుతంగా వున్నాయి. తొలుత విద్యార్థులకు వక్తత్వం, చర్చ, పోస్టర్‌ మేకింగ్‌, జంగిల్స్‌, చిత్రలేఖనం, క్విజ్‌ పోటీలు జూనియర్‌, సీనియర్‌ విభాగాల్లో నిర్వహించారు. సీనియర్‌ విభాగంలో 25 పాఠశాలల నుంచి 48 మంది, జూనియర్‌ విభాగంలో 27 మంది విద్యార్థులు హాజరయ్యారు. డ్రాయింగ్‌ విభాగంలో సీనియర్‌ కేటగిరిలో 86 మంది, జూనియర్‌ విభాగంలో 66 మంది, వక్తృత్వ పోటీలకు జూనియర్‌ విభాగంలో 44 మంది, సీనియర్‌ విభాగంలో 53 మంది పాల్గొని సత్తాచాటారు. పోస్టర్‌ మేకింగ్‌లో ఆరుగురు ప్రతిభ కనభరించారు. ఈ పోటీల విజేతలకు ఈనెల 13న బహుమతులు అందిస్తామని కమిషనర్‌ దినేష్‌కుమార్‌ తెలిపారు.

Updated Date - 2022-08-09T07:03:13+05:30 IST