విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకోవాలి

ABN , First Publish Date - 2022-05-22T06:03:03+05:30 IST

విద్యార్థులు బాల్యం నుంచే ఉన్నత లక్ష్యా లు నిర్దేశించుకొని దానికి అనుగుణంగా తమ వంతు కృషి చేయాలని అ దనపు ఎస్పీ రూపేష్‌ అన్నారు.

విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకోవాలి
మాట్లాడుతున్న అదనపు ఎస్పీ రూపేష్‌

అడిషనల్‌ ఎస్పీ రూపేష్‌ 

జగిత్యాల అగ్రికల్చర్‌, మే 21: విద్యార్థులు బాల్యం నుంచే ఉన్నత లక్ష్యా లు నిర్దేశించుకొని దానికి అనుగుణంగా తమ వంతు కృషి చేయాలని అ దనపు ఎస్పీ రూపేష్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని గీతా విద్యాలయంలో సేవా భారతి ఆధ్వర్యంలో 3నుంచి 9వ తరగతి విద్యార్థినీ, విద్యార్థులకు సంస్కార సాధన శిబిరం ముగింపు కార్యక్రమంలో ముఖ్య అ తిథిగా హాజ రయ్యారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులు బాల్యం నుంచే ఉన్నత ల క్ష్యాలను నిర్దేశించుకొని దానికి అనుగుణంగా ప్రణాళిక బద్దంగా కృషి చేస్తే విజయం సాధించవచ్చన్నారు. విద్యార్థులు కేవలం చదువుపైనే దృషిపెట్ట కుండా శారీరకంగా, మానసికంగా ఎదిగే విధంగా ఆటలు, వ్యాయా మం, యోగాను నిత్యసాధన చేయాలన్నారు. అనంతరం గ్రామ భారతి ప్రాంత ప్రముఖ్‌ జిన్నా సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ సేవా భారతి ద్వారా రా ష్ట్రంలో లక్షయాభై వేల సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. డా క్టర్‌ రాచకొండ శ్రీనివాస్‌, ఆర్‌ఎస్‌ ఎస్‌ నగర సంఘచాలక్‌ పురుషోత్తం, కౌ న్సిలర్లు రాజ్‌కుమార్‌, రాము, వాల్మీకి ఆవాస కార్యదర్శి మదన్‌మోహన్‌ రా వు, అశోక్‌రావు, సంపూర్ణచారి, సాయి మధుకర్‌, సంతోష్‌, మునీంద్ర, రాజ న్న, శ్యాం తదితరులున్నారు.

Updated Date - 2022-05-22T06:03:03+05:30 IST