విద్యార్థులు కలిసి మెలిసి ఉండాలి

ABN , First Publish Date - 2021-07-25T04:17:35+05:30 IST

విద్యార్థులు కళాశాలల్లో కుటుంబ సభ్యుల వలె కలిసిమెలిసి ఉండాలని జిల్లా రెండో అదనపు న్యాయమూర్తి వీర య్య అన్నారు.

విద్యార్థులు కలిసి మెలిసి ఉండాలి
మాట్లాడుతున్న రెండో అదనపు జిల్లా జడ్జి వీరయ్య

మహబూబ్‌నగర్‌ లీగల్‌ కంట్రిబ్యూటర్‌, జూలై 24: విద్యార్థులు కళాశాలల్లో కుటుంబ సభ్యుల వలె కలిసిమెలిసి ఉండాలని జిల్లా రెండో అదనపు న్యాయమూర్తి వీర య్య అన్నారు. కళాశాలల్లో ర్యాగింగ్‌ పేరుతో చట్ట వ్యతిరేక కార్యకలా పాలకు పాల్పడకూడదని సూచించారు. ర్యాగింగ్‌ నిషేధ చట్టంపై వెబినార్‌ ద్వారా అవగాహన కల్పించారు. అనంతరం సీనియర్‌ సివిల్‌ జడ్జి వెంకట్రామ్‌ మాట్లాడారు. కార్యక్రమంలో ఎన్టీఆర్‌ మహిళా డిగ్రీ కళాశాల, ఎంవీఎస్‌ డిగ్రీ కళాశాల, జడ్చర్ల డాక్టర్‌ బీఆర్‌ఆర్‌ డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాల్స్‌, లెక్చరర్లు పాల్గొన్నారు. 


Updated Date - 2021-07-25T04:17:35+05:30 IST