విద్యార్థులు లక్ష్యంతో ముందుకు సాగాలి

ABN , First Publish Date - 2022-05-18T05:51:27+05:30 IST

విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రభుత్వం ఉద్యో గ నోటిఫికేషన్లు జారీ చేస్తోందని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ తెలిపారు.

విద్యార్థులు లక్ష్యంతో ముందుకు సాగాలి
నిరుద్యోగులకు స్టడీ మెటీరియల్‌ అందజేస్తున్న మంత్రి

మంత్రి కొప్పుల ఈశ్వర్‌

ధర్మపురి, మే 17: విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రభుత్వం ఉద్యో గ నోటిఫికేషన్లు జారీ చేస్తోందని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ తెలిపారు. ధర్మ పురి పట్టణంలోని ఉర్దూ ఘర్‌కం షాదీఖానా, టీటీడీ కళ్యాణ మండపం లో ధర్మపురి ఈ క్లాస్‌ రూమ్‌ పేరుతో ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ, ఎల్‌ ఎం కొప్పుల సోషల్‌ సర్వీసెస్‌ ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలో ఎస్‌ఐ, పోలీస్‌ కా నిస్టేబుల్‌, గ్రూప్‌ పరీక్షల కోసం ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణా కేంద్రాల ను ఎల్‌ఎం కొప్పుల చారిటబుల్‌ ట్రస్టు అధ్యక్షురాలు కొప్పుల స్నేహలతతో కలిసి మంగళవారం ఆయన సందర్శించారు. అనంతరం నిరుద్యోగ యువ తీ యువకులకు ఆయా కేంద్రాల్లో వారు స్టడీ మెటీరియల్‌ పంపిణీ చేశా రు. ఈ సందర్భంగా వారు నిరుద్యోగ యువతీ యువకులతో మాట్లాడారు.  మౌలిక సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మం త్రి మాట్లాడుతూ రాష్ట్ర విభజన అనంతరం ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి నిరుద్యోగ సమస్య ని ర్మూలన కోసం ముందుకు సాగుతోందని తెలిపారు. గత ప్రభుత్వాలు, పా లకులు నిధులు, నీరు, ఉద్యోగాల విషయంలో నిర్లక్ష్యం వహించడం వల్ల తెలంగాణ ప్రజలు దగా పడ్డారని ఆయన గుర్తు చేశారు. సీఎం కేసీఆర్‌ గొప్ప ఆలోచనతో నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు జారీ చేస్తున్న నోటిఫికేషన్ల ద్వారా అనేక శాఖల్లో ఉద్యోగాలు భర్తీ చేస్తుందన్నారు. ఇందుకు నియోజకవర్గ స్థాయిలో నిరుద్యోగ యువత కోసం శిక్షణా తరగతులు ఏర్పాటు చేసి, భోజన వసతి, స్టడీ మెటీరియల్‌ అందిస్తున్న ట్లు ఆయన వివరించారు. యువతీ, యువకులు ఉచిత శిక్షణా తరగతుల ను వినియోగించుకుని ఉద్యోగమే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని ఆయన సూచించారు. డీఎస్సీ కోసం ప్రిపేర్‌ అయ్యే అభ్యర్థుల కోసం వచ్చే నెలలో ఇక్కడ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఎల్‌ఎం కొప్పు ల చారిటబుల్‌ ట్రస్టు అధ్యక్షురాలు కొప్పుల స్నేహలత మాట్లాడుతూ హై దరాబాద్‌ లాంటి నగరాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో అందించే స్థాయి లో ఇక్కడ అర్హులైన పేదలకు ఉచిత శిక్షణా తరగతులను అందిస్తున్న ట్లు తెలిపారు. శిక్షణ పొందే వారు శ్రద్ధ వహించి, పోటీ పరీక్షల్లో మంచి ప్రతిభ కనబరచి ఉద్యోగాలు సాధించాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్య క్రమంలో కరీంనగర్‌ డీసీఎంఎస్‌ చైర్మన్‌ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సంగి సత్యమ్మ, ఎంపీపీ చిట్టిబాబు, జడ్పీటీసీ అరుణ, జిల్లా సంక్షేమ శాఖ అధికారి డాక్టర్‌ నరేష్‌, కేరళ ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌ క రస్పాండెంట్‌ శ్యాంసుందర్‌,  శ్రీకాంత్‌, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షులు ఆకుల రాజేష్‌ పాల్గొన్నారు.

మినీ స్టేడియం నిర్మాణానికి స్థల పరిశీలన

ధర్మపురి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో నూతనంగా ని ర్మించే మినీ స్టేడియం కోసం మంత్రి కొప్పుల ఈశ్వర్‌ మంగళవారం స్థల పరిశీలన చేశారు. రాష్ట్ర స్పోర్ట్స్‌ అథారిటీ సంస్థ ద్వారా మినీ స్టేడియం ని ర్మాణం కోసం రూ 2.65 కోట్లు నిధులు మంజూరు అయ్యాయని తెలి పా రు. ఈ నిధులతో స్టేడియం నిర్మాణ పనులు పూర్తి జరిగితే వివిధ రకాల క్రీడలు, స్పోర్ట్స్‌ కోసం క్రీడాకారులకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని ఆ యన వివరించారు. అలాగే కళాశాల ప్రిన్సిపాల్‌ రమేష్‌ను విద్యార్థుల సంఖ్య, పరీక్షల నిర్వహణ, సౌకర్యాలు గురించి ఆయన అడిగి తెలుసు కున్నారు. పరీక్షల సమయంలో విద్యార్థులకు అవసరం అయ్యే ఏర్పాట్లు చేయాలని ఆయన అన్నారు. 


 


Updated Date - 2022-05-18T05:51:27+05:30 IST