విద్యార్థులు క్రమశిక్షణతో నడుచుకోవాలి

ABN , First Publish Date - 2022-06-26T05:54:47+05:30 IST

విద్యార్థులు క్రమశిక్షణలో నడుచుకుని మంచి పేరు తెచ్చుకోవాలని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు పేరు తేవా లని కోరుట్ల సీఐ రాజశేఖర్‌ రాజు అన్నారు.

విద్యార్థులు క్రమశిక్షణతో నడుచుకోవాలి
ప్రొజెక్టర్‌ సహాయంతో వివరిస్తున్న ఉపాధ్యాయుడు

 కోరుట్ల సీఐ రాజశేఖర్‌ రాజు

కోరుట్ల రూరల్‌, జూన్‌ 25 : విద్యార్థులు క్రమశిక్షణలో నడుచుకుని మంచి పేరు తెచ్చుకోవాలని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు పేరు తేవా లని కోరుట్ల సీఐ రాజశేఖర్‌ రాజు అన్నారు. శనివారం మండలంలోని జిల్లా పరిషత్‌ పాఠశాలలో గ్రామస్థులు, పాఠశాల ఉపాధ్యాయుల ఆధ్వ ర్యంలో నిర్వహించిన పేరెంట్స్‌ సమావేశంలో సర్పంచ్‌ ఫోరం జిల్లా అధ్య క్షుడు రాజేష్‌తో కలిసి పాల్గొన్న సీఐ విద్యార్థులకు మార్గదర్శకం చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ గ్రామస్థాయి విద్యార్థులు గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చదివించే విధంగా తల్లిదండ్రులు చోర చూపడం అభినందనీయమన్నారు. విద్యార్థులు స్మాట్‌ ఫోన్‌లను వాడి వ్యసనాలకు గురి కాకుండా ఉండాలని అన్నారు. చెడు అలవాట్లకు దూరంగా ఉండి విద్యపై శ్రద్ధ చూపి ఉన్నత స్థానాలను చేరుకోవాలని అన్నారు. నూతనం గా ప్రవేశ పెట్టిన మార్డన్‌ టీచింగ్‌ విధానాన్ని పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రొజెక్టర్‌ ద్వారా వివరించి అవగాహన కల్పిం చారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యుడు కృష్ణా రెడ్డి, సింగిల్‌ విండో చైర్మన్‌ అదిరెడ్డి, ఉప సర్పంచ్‌ మల్లారెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బాజోజీ శ్రీనివాస్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-26T05:54:47+05:30 IST