విద్యార్థులు వంద శాతం హాజరుకావాలి

ABN , First Publish Date - 2021-10-29T04:00:11+05:30 IST

ప్రభుత్వ పాఠశాల ల్లో విద్యార్థుల హాజరు శాతం వందశాతం నమోదు కావాలని డీఈవో వెంకటేశ్వర్లు ఉపాధ్యాయులకు సూ చించారు. గురువారం సోమగూడెం లంబాడి తండా, ముత్యంపల్లి జిల్లా పరిషత్‌ పాఠశాలలతోపాటు కేజీబీవీ పాఠశాలను సందర్శించారు. ఉపాధ్యాయులను వివరాలను అడిగి తెలుసుకున్నారు.

విద్యార్థులు వంద శాతం హాజరుకావాలి
ఉపాధ్యాయులతో మాట్లాడుతున్న డీఈవో

కాసిపేట, అక్టోబరు 28: ప్రభుత్వ పాఠశాల ల్లో విద్యార్థుల హాజరు శాతం వందశాతం నమోదు కావాలని డీఈవో వెంకటేశ్వర్లు ఉపాధ్యాయులకు సూ చించారు. గురువారం సోమగూడెం లంబాడి తండా, ముత్యంపల్లి జిల్లా పరిషత్‌ పాఠశాలలతోపాటు కేజీబీవీ పాఠశాలను సందర్శించారు. ఉపాధ్యాయులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలల్లో హాజరు శాతం తక్కువగా ఉండడంపై అసంతృప్తి వ్యక్తంచేశారు. విద్యావాలంటీర్ల పోస్టు లు మంజూరు కాగానే అన్ని పాఠశాలలకు నియమిస్తామన్నారు. ఏబీసీ(3ఆర్‌) ప్రోగ్రాంను ప్రతి పాఠశాలలో గ్రూపులుగా చేసి చివరి రెండు పీరియడ్‌లను బోధించాలని సూచించారు. ఎంఈవో దామోదర్‌, సీసీవో రాంబాబు ఉన్నారు. 

Updated Date - 2021-10-29T04:00:11+05:30 IST