విద్యార్థులూ.. పరీక్షలంటే ఆందోళన వద్దు

ABN , First Publish Date - 2022-04-30T04:27:14+05:30 IST

ఇంటర్‌, పదో తరగతి వార్షిక పరీక్షలు సమీపిస్తున్న కొద్ది విద్యార్థులతో పాటు తల్లిదండ్రుల్లోనూ ఆందోళన మొదలవుతుంది.

విద్యార్థులూ.. పరీక్షలంటే ఆందోళన వద్దు
వివిధ రకాల పండ్లు

- చక్కటి పౌష్టికాహారం తీసుకోవాలి

- వేళకు నిదుర పోవాలి

- యోగా ఉత్తమమం 

 వాంకిడి ఏప్రిల్‌ 29: ఇంటర్‌, పదో తరగతి వార్షిక పరీక్షలు సమీపిస్తున్న కొద్ది విద్యార్థులతో పాటు తల్లిదండ్రుల్లోనూ ఆందోళన మొదలవుతుంది. తీవ్ర ఒత్తుడుల నేపథ్యంలో ఇంటర్‌, పదిలో ఉత్తమ ఫలితాలను సాధించటం కోసం దృష్టి కేంద్రీకరించే విద్యార్థులు ఆహారం తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తారు. దీంతో చదువుపై ఆసక్తి తగ్గిపోయి లక్ష్యం నీరుగారిపోయే ప్రమాదముంది. పరీక్షల సమయంలో విద్యార్థులు జాగ్రత్తలు పాటిస్తూ ఒత్తిడికి గురికాకుండా సమయానికి ఆహారం తీసుకుంటూ బాగా నిద్రపోతే జ్ఞాపకశక్తి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. 

తీసుకోవాల్సిన ఆహారం..

- చదివేటప్పుడు ఒత్తిడికి గురికావడంతో కడుపులో మంట వస్తుంది. పండ్లరసాలు, మజ్జిగతో కూడిన అన్నం తీసుకుంటే బాగుంటుంది. 

- క్యారెట్‌ను తినటం వల్ల విటమిన్‌ ఏ లభించి కళ్లకు మేలు చేకూరుతుంది. 

- ఉదయం ఇండ్లీ తినటం వల్ల విద్యార్థులకు కార్బోహైడ్రేట్స్‌ లభించి శక్తిని అందిస్తాయి. 

- జామ, అరటి, యాపిల్‌ వంటి పండ్లను తీసుకోవటం వల్ల జీర్ణవ్యవస్థ చక్కగా పనిచేస్తుంది.

- విద్యార్థులు ఒత్తిడికి గురికావటంతో చెమటలు పడతాయి. ఇలాంటి విద్యార్థులు నీటిని ఎక్కువగా తీసుకోవాలి. 

- పరీక్షల సమయంలో కొవ్వు పదార్థాలు, నూనె వస్తువులు, మాంసాహారాన్ని వీలైనంత వరకు తగ్గించుకోవాలి. 

- తీసుకునే ఆహారం పరిమాణం తగ్గించాలి. నిద్రపోయే ముందు పాలు తీసుకోవాలి. 

- ఒత్తిడిని అధిగమించేందుకు యోగా చేస్తే ఫలితం ఉంటుంది. 

- ఆహారం, నిద్ర ముఖ్యం

   డాక్టర్‌ సతీష్‌

విద్యార్థులు ఒత్తిడికి గురికావద్దు. చదివిన అంశాలు గుర్తు ఉండాలంటే నిద్రకు 7-8గంటలు కేటాయించాలి. విద్యార్థులు ఇడ్లీ, పెరుగు అన్నం, అరటిపండు, క్యారెట్‌, పాలు, నీళ్లు ఎక్కువగా తీసుకుంటే మంచిది. సమయానికి ఆహారం తప్పనిసరిగా తీసుకోవాలి.

Updated Date - 2022-04-30T04:27:14+05:30 IST