వరంగల్: జిల్లాలో ర్యాగింగ్‌కు విద్యార్థి బలి అయ్యాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కరుణాపురంలోని ప్రభుత్వ హాస్టల్‌లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న భరత్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గుట్కా ప్యాకెట్స్ తీసుకు రమ్మని సీనియర్స్ విద్యార్థుల ర్యాగింగ్ చేయడం వల్లే భరత్ ఆత్మహత్య చేసుకున్నాడని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. మృతదేహాన్ని ఎంజీఎం ఆస్పత్రి మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి