గర్భం దాల్చిన విద్యార్థిని

ABN , First Publish Date - 2022-04-21T16:01:36+05:30 IST

తిరువళ్లూర్‌ సమీపంలో ఏడాదిగా ప్లస్‌ వన్‌ విద్యార్థినిని బెదిరించి అత్యాచారం చేసి గర్భవతిని చేసిన వృద్ధుడిని పోలీసులు పోక్సో చట్టం కింద అరెస్ట్‌ చేశారు.

గర్భం దాల్చిన విద్యార్థిని

                       - పోక్సో చట్టం కింద వృద్ధుడి అరెస్టు


పెరంబూర్‌(చెన్నై): తిరువళ్లూర్‌ సమీపంలో ఏడాదిగా ప్లస్‌ వన్‌ విద్యార్థినిని బెదిరించి అత్యాచారం చేసి గర్భవతిని చేసిన వృద్ధుడిని పోలీసులు పోక్సో చట్టం కింద అరెస్ట్‌ చేశారు. సెంజి గ్రామం మేలాండై వీధికి చెందిన పరశురామన్‌కు (63) ఆ ప్రాంతంలో జామతోట ఉంది. ఈ తోటలో జామకాయలు కోసేందుకు ఓ విద్యార్థిని వస్తుండేంది. తండ్రి మృతిచెందడంతో తల్లితో ఆ బాలిక ఉంటోంది. ఈ నేఫధ్యంలో, ఏడాది క్రితం బాలికకు మాయమాటలు చెప్పిన పరశురామన్‌ ఆమెపై అత్యాచారానికి పాల్పడి, ఈ విషయమై బయటకు చెబితే చంపుతానని బెదిరించాడు. అనంతరం బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో, బాలిక పొట్ట ఉబ్బెత్తుగా ఉండడం చూసి తల్లి ఆమెను నిలదీయగా జరిగిన విషయం తెలుసుకొని దిగ్ర్భాంతి చెందింది. ఈ విషయమై బాలిక తల్లి తిరువళ్లూర్‌ మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదుచేయడంతో సీఐ లోకేశ్వరి విచారణ చేపట్టి పోక్సో చట్టం కింద కేసు నమోదుచేసి పరశురామన్‌ను అరెస్ట్‌ చేసి జైలుకు తరలించారు.

Updated Date - 2022-04-21T16:01:36+05:30 IST