20 ఏళ్ల యువతికి షాకింగ్ అనుభవం.. నెలసరి నొప్పులు అనుకుని బాత్రూంకు వెళ్తే పసిబిడ్డతో సహా బయటకు..!

ABN , First Publish Date - 2022-06-28T20:09:05+05:30 IST

యునైటెడ్ కింగ్‌డమ్‌లోని ఓ యూనివర్సిటీలో చదువుతున్న ఓ 20 ఏళ్ల యువతికి షాకింగ్ అనుభవం ఎదురైంది.

20 ఏళ్ల యువతికి షాకింగ్ అనుభవం.. నెలసరి నొప్పులు అనుకుని బాత్రూంకు వెళ్తే పసిబిడ్డతో సహా బయటకు..!

యునైటెడ్ కింగ్‌డమ్‌లోని ఓ యూనివర్సిటీలో చదువుతున్న ఓ 20 ఏళ్ల యువతికి షాకింగ్ అనుభవం ఎదురైంది. కడుపు నొప్పి వస్తుండడంతో నెలసరి నొప్పులేమో అనుకుని బాత్రూమ్‌కు వెళ్లిన యువతికి అక్కడే ప్రసవం అయిపోయింది.. ఆ యువతికి ప్రెగ్నెన్సీకి సంబంధించి ఎలాంటి లక్షణాలూ లేవు, బేబీ బంప్ కూడా లేదు.. తను గర్భవతిననే అనుమానం కూడా ఆమెకు లేదు.. అలాంటిది అకస్మాత్తుగా డెలివరీ అయ్యేటప్పటికీ ఆమె షాకైంది. 


ఇది కూడా చదవండి..

రోజూ Maggi Noodles పెడుతున్న భార్య.. విసుగొచ్చిన భర్త ఏం చేశాడంటే..


యూకేలోని సౌతాంప్టన్ యూనివర్సిటీలో చదువుతున్న జెస్ డేవిస్ అనే యువతి ఇటీవల ఓ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అసలు తాను గర్భవతిననే విషయం కూడా ఆమెకు తెలియదు. ఎలాంటి లక్షణాలు కనిపించలేదు. అసలు బేబీ బంప్ కూడా లేదు. `నాకు పీరియడ్స్ ఎప్పుడూ రెగ్యులర్‌గా రావు. కాబట్టి నేను గుర్తించలేదు. అప్పుడప్పుడు వికారంగా అనిపించేది. అందుకు మందులు వాడాను. బాత్రూమ్‌లో బిడ్డను చూసినపుడు మొదట నేను కల కంటున్నానేమో అనుకున్నాను. జీవితంలో ఇంత కంటే పెద్ద షాక్ మరొకటి లేదు. 


ఆ రోజు అర్ధరాత్రి దాటాక కడుపునొప్పి వచ్చింది. పీరియడ్స్ మొదలవుతున్నాయేమో అనుకున్నా. మంచం మీద పడుక్కోలేకపోయా. వెంటనే లేచి బాత్రూమ్‌కు వెళ్లా. కడుపు నొప్పి మరింత తీవ్రం అయింది. దాంతో నా పొట్టను కిందకు పుష్ చేశా. అప్పటికీ నాకు అనుమానం రాలేదు. కొద్దిసేపటి తర్వాత బిడ్డ ఏడుపు వినిపించింది. అప్పటికి గాని నాకు జరిగిందేంటో అర్థం కాలేదు. వెంటనే నా స్నేహితురాలికి ఫోన్ చేసి విషయం చెప్పా. వెంటనే అంబులెన్స్‌లో హాస్పిటల్‌కు వెళ్లామ`ని జెస్ చెప్పింది. ప్రస్తుతం తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. 

Updated Date - 2022-06-28T20:09:05+05:30 IST