గోదావరిఖనిలో డెంగ్యూతో విద్యార్థి మృతి

ABN , First Publish Date - 2022-08-09T06:02:39+05:30 IST

రామగుండం నగరపాలక సంస్థ పరిధిలోని పలు ప్రాంతాల్లో పారిశుధ్యం లోపించి జనం వ్యాధుల బారిన పడు తున్నారు.

గోదావరిఖనిలో డెంగ్యూతో విద్యార్థి మృతి
నిల్వ నీటిలో ఆయిల్‌ బాల్స్‌ వేస్తున్న మున్సిపల్‌ సిబ్బంది

కోల్‌సిటీ, ఆగస్టు 8: రామగుండం నగరపాలక సంస్థ పరిధిలోని పలు ప్రాంతాల్లో పారిశుధ్యం లోపించి జనం వ్యాధుల బారిన పడు తున్నారు. నీరు ఎక్కడ పడితే అక్కడ నిల్వ ఉండడంతో దోమల బెడద తీవ్రమైంది. స్థానిక సుందరయ్యనగర్‌ మున్సిపల్‌ వర్కర్స్‌ కాలనీలో నివాసముండే కొలుగూరి రుషిక్‌(8) అనే బాలుడు డెం గ్యూతో ఆదివారం సాయంత్రం కరీంనగర్‌లోని ఒక ప్రైవేట్‌ ఆసు పత్రిలో మృతిచెందాడు. అతని తండ్రి ఉదయ్‌ రామగుండం మున్సి పల్‌ కార్పొరేషన్‌కు చెందిన వాటర్‌ ట్యాంకర్‌పై డ్రైవర్‌గా పని చేస్తు న్నాడు. చిన్న కుమారుడు రుషిక్‌ సంజయ్‌ గాంధీనగర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో 3వ తరగతి చదువుతున్నాడు. ఈనెల 3వ తేదిన జ్వరం రావడంతో గోదావరిఖనిలోని పిల్లల వైద్యుని వద్ద చికిత్స చేయించారు. 5వ తేదిన వైద్యుని సూచన మేరకు కరీం నగర్‌లోని ప్రతిమ మెడికల్‌ కళాశాలలో చేర్పించారు. రక్తకణాలు తగ్గడంతో చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు పేర్కొం టున్నారు. మున్సిపల్‌ కార్మికుల కాలనీ చుట్టూ మూడు అడుగుల మేర నీరు నిల్వ ఉంది. ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసు కెళ్లినా పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు పేర్కొంటున్నారు. అడ్డగుంటపల్లి చెరువు నుంచి వెళ్లే నాలాలను రియల్టర్లు పూడ్చడంతో తమ కాలనీవద్ద నీరు నిల్వ ఉంటుందని వారు పేర్కొంటున్నారు. తమ కాలనీపక్కన ఉన్న మున్సిపల్‌ ముఖ్య ప్రజా ప్రతినిధిగా చెబుతు న్నారని, దీనిపై ఎవరూ స్పందించడం లేదన్నారు. కార్పొరేషన్‌ పారిశుధ్య విభాగం సిబ్బంది కాలనీలోని ఇండ్ల చుట్టూ బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లించారు. వైద్య సిబ్బంది రక్త నమూనాలు సేకరిస్తున్నారు. ఉదయ్‌, లత దంపతులకు ఇద్దరు కుమారులు కాగా రుషిక్‌ చిన్న కుమారుడు. 

Updated Date - 2022-08-09T06:02:39+05:30 IST