రిటైర్మెంట్‌ ప్రకటిద్దామనుకున్నా

ABN , First Publish Date - 2020-08-03T09:00:16+05:30 IST

వెస్టిండీస్‌తో ఇటీవలే జరిగిన టెస్ట్‌ సిరీ్‌సలో సౌతాప్టంన్‌లో జరిగిన తొలి మ్యాచ్‌కు తనను ఎం పిక చేయకపోవడంపై తీవ్రంగా...

రిటైర్మెంట్‌ ప్రకటిద్దామనుకున్నా

లండన్‌: వెస్టిండీస్‌తో ఇటీవలే జరిగిన టెస్ట్‌ సిరీ్‌సలో సౌతాప్టంన్‌లో జరిగిన తొలి మ్యాచ్‌కు తనను ఎం పిక చేయకపోవడంపై  తీవ్రంగా కలత చెందానని ఇంగ్లండ్‌ పేసర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ అన్నాడు. నిరాశలో కెరీర్‌కు రిటైర్మెంట్‌ ప్రకటిద్దామనుకున్నానని చెప్పాడు. ‘తుది జట్టులో స్థానం లభించకపోవడంతో తీవ్ర నిరాశకు లోనయ్యా. బుర్రనిండా రిటైర్మెంట్‌ ఆలోచనలే. తాత్కాలిక కెప్టెన్‌ స్టోక్స్‌ వచ్చి.. నేను ఆడడం లేదని చెప్పినప్పుడు నోట మాట రాలేదు’ అని ఓ ఇంటర్వ్యూలో బ్రాడ్‌ చెప్పాడు. తొలి టెస్ట్‌కు ఎంపిక కాలేకపోయినా.. ఆ తర్వాత జరిగిన రెండు టెస్ట్‌ల్లో జట్టులో చోటుదక్కించుకున్న బ్రాడ్‌ అద్భుత ప్రదర్శన చేయడంతోపాటు ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీ్‌సగా నిలిచిన సంగతి తెలిసిందే. 


Updated Date - 2020-08-03T09:00:16+05:30 IST