విమర్శల నుంచి బయటపడేందుకు Kolhi ఏం చేస్తున్నాడో తెలుసా..

ABN , First Publish Date - 2022-05-12T00:20:53+05:30 IST

ముంబై : Royal Challengers Bangalore స్టార్ బ్యాట్స్‌మెన్ Virat Kohli ప్రస్తుత ఐపీఎల్ సీజన్ 2022లో దారుణంగా విఫలమవుతున్నాడు.

విమర్శల నుంచి బయటపడేందుకు Kolhi ఏం చేస్తున్నాడో తెలుసా..

ముంబై : Royal Challengers Bangalore స్టార్ బ్యాట్స్‌మెన్ Virat Kohli ప్రస్తుత ఐపీఎల్ సీజన్ 2022లో దారుణంగా విఫలమవుతున్నాడు. ఫామ్‌లేమితో సతమతమవుతూ ఫ్యాన్స్‌తోపాటు క్రికెట్ ప్రేమికులను కూడా నిరాశపరుస్తున్నాడు. ఈ నేపథ్యంలో కోహ్లీపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫ్యాన్స్‌తోపాటు మాజీ ఆటగాళ్లు సైతం కోహ్లీ ప్రదర్శనను వేలెత్తిచూపుతున్నారు. విమర్శకుల సంఖ్య ఎక్కువవుతున్న తరుణంలో కోహ్లీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ‘‘ అంతకంతకూ పెరిగిపోతున్న విమర్శకుల నుంచి బయటపడేందుకు నా దగ్గర ఖచ్చితమైన మార్గం ఉంది. టీవీని మ్యూట్‌ చేస్తా ’’ అని కోహ్లీ అన్నాడు. తనను విమర్శించే వారి నుంచి బయటపడడం నేర్చుకున్నానని కోహ్లీ చెప్పాడు. ‘నా పరిస్థితిని వారు అనుభవించలేరు. నా అనుభూతిని వారు పొందలేరు. నా ఉద్వేగాలను వారు పొందలేరు’ అని కోహ్లీ అన్నాడు. క్రికెట్ విశ్లేషకులు తనను తక్కువ చేసి చూపుతున్నారని అన్నాడు. ఈ మేరకు ఆర్‌సీబీ వెబ్‌సైట్‌లో కోహ్లీ మాట్లాడిన ఈ వీడియో ఉంది. విశ్లేషకుల మాటలు వినకుండా ఏం చేస్తారు.. టీవీని మ్యూట్ చేస్తారా లేదా వారి మాటలను పట్టించుకోరా అని వ్యాఖ్యాత ప్రశ్నించగా..  రెండూ చేస్తానని కోహ్లీ సమాధానమిచ్చాడు. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ తన కెరీర్‌లో రాలేదు. చాలా కాలం తర్వాత ఈ స్థితిని ఎదుర్కొంటున్నానని చెప్పాడు. 


కాగా కోహ్లీ అన్ని ఫార్మాట్లలో కలిపి 100కిపైగా మ్యాచుల్లో ఒక్క సెంచరీ కూడా కొట్టలేకపోయాడు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో 12 మ్యాచ్‌లు ఆడి కేవలం 216 పరుగులు మాత్రమే చేశాడు. కేవలం ఒక హాఫ్ సెంచరీ మాత్రమే చేశాడు. ఒక్క ఐపీఎల్ ట్రోఫీ అయినా గెలవాలనేది కోహ్లీకి డ్రీమ్‌గా ఉంది. 2013 నుంచి 2021 సీజన్ వరకు ఆర్‌సీబీ కెప్టెన్‌గా కొనసాగినా ఆ కల నెరవేరలేదు. కాగా కోహ్లీ అలసిపోయినట్టు కనిపిస్తున్నాడని, కొంత విరామం అవసరమని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. కాగా ఫామ్ లేమితో కోహ్లీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఆదివారం Sunrisers Hyderabadపై మ్యాచ్‌తో కలిపి ఈ సీజన్‌లో కోహ్లీ ఇప్పటివరకు 3 సార్లు గోల్డెన్ డకౌట్ అయ్యాడు.   

Read more